దాస్ జోరుకి దసరా బ్రేక్

యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ప్రస్తుతం థియేటర్స్ లో ఆడుతుంది. మార్చ్ 22 న ఉగాది సందర్భంగా స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ సినిమా యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. దాంతో యావరేజ్ టాక్ తోనే సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ తెచ్చుకొని ఔరా అనిపించింది. ఇక నాలుగు రోజుల్లోనే ఆ నంబర్ కి డబుల్ రేంజ్ లో 18 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

తొమ్మిది రోజులకు గానూ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21 . 51 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టింది. ఇక తెలంగాణా , ఆంధ్రప్రదేశ్ లో ‘దాస్ కా ధమ్కీ’ సినిమా 15 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఇలా మంచి వసూళ్లతో జోరు మీదున్న దాస్ కి ధమ్కీ ఇచ్చింది దసరా. మొదటి వారం డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకున్న విశ్వక్ జోరుకి నాని పెద్ద బ్రేక్ వేశాడు.

దసరా డే వన్ కలెక్షన్ తో ధమ్కీ ఇచ్చాడు నాని. రిలీజ్ కి ముందే భారీ హైప్ తెచ్చుకున్న దసరా నిన్న శ్రీరామనవమి సందర్భంగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సెలవు రోజు పైగా నాని నుండి మొదటి సారి వచ్చిన మాస్ సినిమా కావడంతో దసరా మొదటి రోజే భారీ కలెక్షన్ తెచ్చుకుంది. నాని పాన్ ఇండియా మూవీకి వరల్డ్ వైడ్ గా 38 కోట్ల గ్రాస్ వచ్చింది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో దసరా 24 :85 కోట్లు (గ్రాస్) రాబట్టింది.

తొలి రోజు దసరా కలెక్షన్ చూస్తే ‘ధమ్కీ’ పై పెద్ద ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తుంది. రెండో వారంలో ధమ్కీ మరిన్ని కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని అనుకున్న విశ్వక్ కి దసరా కలెక్షన్స్ తో పెద్ద బ్రేక్ వేసింది. నిజానికి రెండూ వేర్వేరు కథలతో వచ్చిన సినిమా అయినప్పటికీ నాని మాస్ సినిమాకే ఈ వీకెండ్ ఆడియన్స్ ఓటేసె అవకాశం ఉంది. ఒక వేళ దసరా కాకపోతే మరో ఆప్షన్ చూస్తే మాత్రం విశ్వక్ కి కొంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ధమ్కీ కలెక్షన్ పై దసరా సక్సెస్ గట్టి ప్రభావం చూపనుంది.