ఎనిమిదేళ్ల ముందు ‘భలే భలే మగాడివోయ్’ సినిమా టైటిల్స్‌లో నాని పేరు ముందు ‘నేచురల్ స్టార్’ అని పడింది. అది చూసి చాలామంది వెటకారాలు కూడా ఆడారు. నానికి అప్పుడే స్టార్ ఇమేజ్ వచ్చేసిందా.. అతడికి కూడా ఒక ట్యాగ్ అవసరమా అని. నిజానికి మారుతి సరదాకే ఆ ట్యాగ్ వేశాడేమో. కానీ జనాలు దాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. మీడియా వాళ్లతో పాటు నానీని అభిమానించే వాళ్లు కూడా అతణ్ని నేచురల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు.
‘భలే భలే మగాడివోయ్’ ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ విజయం సాధించి నాని తక్కువోడు కాదు అని రుజువు చేసింది. ఆ తర్వాత వరుసబెట్టి హిట్లు కొట్టి టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు నాని. ‘ఎంసీఏ’ లాంటి మామూలు సినిమా కూడా ఆ ఊపులో బ్లాక్‌బస్టర్ అయి కూర్చుంది. ఆ తర్వాత నాని కొంత తడబడ్డప్పటికీ.. తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు.
ఐతే కెరీర్లో ఒక దశ దాటి ఇంకో దశకు చేరాక ఎక్కువ కాలం అదే స్థాయిలో ఉంటే ఎదుగుదల ఆగిపోయినట్లే అనిపిస్తుంది. నాని ఫ్యాన్స్ కూడా అతను నెక్స్ట్ లెవెల్‌కు ఎప్పుడు వెళ్తారా అని చూస్తున్నారు. ‘దసరా’ సినిమాతో వారి కోరిక తీరినట్లే కనిపిస్తోంది. టాప్ స్టార్లు మాత్రమే చేసే పక్కా మాస్ పాత్రను ఎంచుకుని పెద్ద సాహసమే చేశాడు నాని. సాఫ్ట్ ఇమేజ్ ఉన్న అతడికి ఇంత ఊర మాస్ పాత్ర సెట్ అవుతుందా అన్న సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. కానీ ‘దసరా’ సినిమా చూశాక ఆ సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి.
ఊర మాస్ స్టయిల్లో హీరోయిజాన్ని పండించి తాను ఏదైనా చేయలగనని చాటి చెప్పాడు. ఇక ఈ సినిమాకు ఉన్న హైప్‌కు తగ్గట్లే ఓపెనింగ్స్ వస్తున్నాయి. తొలి రోజు ఏకంగా రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్లో టైర్-1 హీరోలకు మాత్రమే సాధ్యమైన ఘనత ఇది.
టైర్-2లో ఉన్న రవితేజ, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్ లాంటి హీరోలకు కూడా ఈ మార్కు సాధ్యం కాలేదు. నాని టైర్-1కు ఎదిగిపోయాడు అనలేం. అదే సమయంలో టైర్-2కు పరిమితమూ చేయలేం. మధ్యలో ఒక కొత్త లీగ్‌లోకి అతను అడుగుపెట్టాడని చెప్పొచ్చు. ‘దసరా’తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించి.. నిలకడగా ఘన విజయాలు సాధిస్తే.. భవిష్యత్తులో టాప్ లీగ్‌లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.
This post was last modified on March 31, 2023 8:04 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…