ఏడు నెలల దూరంలో ఉండగానే దసరా పండగ టాలీవుడ్ బాక్సాఫీస్ ని వేడెక్కిస్తోంది. సంక్రాంతి రేంజ్ లో నువ్వా నేనా అంటూ స్టార్ హీరోల సినిమాలు తలపడబోతున్నాయి. తాజాగా బాలకృష్ణ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం విజయదశమికి ఆయుధపూజ జరుపుకోబోతోందంటూ ఓ కొత్త పోస్టర్ తో అధికారిక ప్రకటన ఇచ్చారు.
అది అక్టోబర్ 20 లేదా 21 అనే స్పష్టత ఇవ్వలేదు కానీ రెండు డేట్లలో ఒకటి ఖాయంగా ఉండబోతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సీరియస్ లుక్ తో వెనుక దుర్గాదేవి శత్రుసంహారం చేస్తున్న విగ్రహాన్ని బ్యాక్ గ్రౌండ్ లో పెట్టడం చూస్తే అనిల్ రావిపూడి తన రెగ్యులర్ కామెడీ స్టైల్ కి భిన్నంగా ఏదో పవర్ ఫుల్ సెటప్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ వరసగా బాలయ్యతో పని చేస్తున్న మూడో కాంబో ఇది. ఇక పోటీ విషయానికి వస్తే రవితేజ టైగర్ నాగేశ్వరరావు రెండు రోజుల క్రితమే పండక్కు వస్తున్నామని చెప్పింది. రామ్ బోయపాటిలు ఆల్రెడీ లాక్ చేసుకున్నారు. ఇవి కాకుండా విజయ్ లోకేష్ కనగరాజ్ లియో మీద తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది
ఎవరు డ్రాప్ అవుతారు ఎవరు నిలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఇంత హైప్ ఉన్న సినిమాలు ఒకేసారి దసరాకు తలపడటం మాత్రం అరుదే. సంక్రాంతికి ఆల్రెడీ రిజర్వేషన్స్ అయ్యాయి కాబట్టి విజయదశమి కంటే వేరే ఆప్షన్ లేదు. దీపావళికి తెలుగు మార్కెట్ లో అంతగా వర్కౌట్ అవ్వదు. అందుకే అందరూ దసరా మీద గురి పెడుతున్నారు. వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న బాలయ్య 2023లో రెండుసార్లు అభిమానులను అలరించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ఆగస్ట్ లోగా మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
This post was last modified on March 31, 2023 2:23 pm
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…