Movie News

అజయ్ దేవగణ్ రికార్డు

బాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంతగా పడిపోయిందో తెలిసిందే. కరోనా తర్వాత బాగా దెబ్బ తిన్న ఆ ఇండస్ట్రీలో పెద్ద హిట్లు అందుకున్న హీరోలు చాలామంది. అందులోనూ వరుసగా రెండు హిట్లు అందుకున్న హీరోలైతే ఒక్కరూ లేరు. ‘సూర్యవంశీ’తో హిట్ కొట్టిన అక్షయ్.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. ‘భూల్ భులయియా-2’తో సక్సెస్ సాధించిన కార్తీక్ ఆర్యన్.. ‘షెజాదా’తో బోల్తా కొట్టాడు.

రణబీర్ సింగ్ ‘బ్రహ్మాస్త్ర’తో ఓ మోస్తరు సక్సెస్ అందుకుని, తర్వాత ‘తూ ఝూటి.. మై మక్కర్’తో అలాంటి ఫలితమే అందుకున్నాడు. ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్.. ‘జవాన్’తో ఎలాంటి పలితాన్ని అందుకుంటాడో చూడాలి. కొవిడ్ తర్వాత వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టిన హీరోలైతే బాలీవుడ్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ రికార్డును అజయ్ దేవగణ్ సొంతం చేసుకునేలా ఉన్నాడు.

అజయ్ ఆల్రెడీ గత ఏడాది ‘దృశ్యం-2’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ‘భోళా’ సూపర్ హిట్ టాక్‌తో మొదలైంది. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’కి రీమేక్. దీన్ని హిందీలో చాలా వరకు మార్చి స్వీయ దర్శకత్వంలో తెరకెెక్కించాడు అజయ్. ఈ చిత్రం త్రీడీలో తెరకెక్కడం విశేషం. ఈ రోజే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘భోళా’కు సూపర్ హిట్ టాక్ వస్తోంది.

సమీక్షకులే కాక.. సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాను కొనియాడుతున్నారు. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటున్నారు. తమిళంతో పోలిస్తే హిందీలో చేసిన మార్పులు బాగానే వర్కవుట్ అయ్యాయంటున్నారు. అమలా పాల్‌తో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు ఆకర్షణగా మారిందట. త్రీడీలో యాక్షన్ ఘట్టాలు చాలా బాగా వచ్చాయట. సినిమా కల్ట్ మూవీ అని ఎవరూ అనట్లేదు కానీ.. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని తీర్మానిస్తున్న నేపథ్యంలో అజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ జమ అయ్యేలాగే ఉంది.

This post was last modified on March 30, 2023 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago