Movie News

ట్రైలర్: ఖాకీ డ్రెస్సులో యూత్ మీటర్

మొన్న ఫిబ్రవరిలో వినరో భాగ్యము విష్ణుకథ రూపంలో చెప్పుకోదగ్గ విజయం అందుకున్న కుర్ర హీరో కిరణ్ అబ్బవరం రెండు నెలలు తిరక్కుండానే మీటర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర ఉన్నప్పటికీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో పోటీకి సిద్ధపడ్డారు. మైత్రి మూవీ మేకర్స్ ఇందులో నిర్మాణ భాగస్వామి కావడంతో  ప్రొడక్షన్ పరంగా ప్రమోషన్ పరంగా మార్కెటింగ్ బాగా జరుగుతోంది. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ ఖాకీ డ్రామాలో అతుల్య రవి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇందాకా ట్రైలర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

కుర్ర పోలీసు అర్జున్ కళ్యాణ్(కిరణ్ అబ్బవరం) కు దూకుడెక్కువ. స్టేషన్ కి వచ్చి జాలీగా టైం పాస్ చేయాలనుకునే రకం. ఇదే డిపార్ట్ మెంట్ లో పని చేసి కొందరు దుర్మార్గుల వల్ల అవమానం పాలైన తండ్రికి న్యాయం జరిగే ఉద్దేశంతో ముందు సరదాగా ఉన్న కళ్యాణ్ తర్వాత రాజకీయ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మీటర్ పెంచి గేరు మారుస్తాడు. వీడేం చేస్తాడని లైట్ తీసుకున్న విలన్ బ్యాచ్ కి చుక్కలు చూపించడం మొదలుపెడతాడు. మరోవైపు ఇతనికో లవ్ స్టోరీ(అతుల్య రవి) రన్ అవుతూ ఉంటుంది. ఇంతకీ కళ్యాణ్ దేనికోసం డ్యూటీ చేశాడనేదే అసలు కథ

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కళ్యాణ్ రామ్ పఠాస్ తరహా ట్రీట్ మెంట్ తో దర్శకుడు రమేష్ పూర్తి కమర్షియల్ ఫార్ములాలో ఈ మీటర్ ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. కిరణ్ చేయడమనే విషయం తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారంలాగే ఉంది. ట్రీట్ మెంట్ లో ఏదైనా వైవిధ్యం చూపించారేమో తెలియాలంటే థియేటర్లలో వచ్చే దాకా ఆగాలి. సాయి కార్తీక్ సంగీతం సైతం రెగ్యులర్ మార్క్ లోనే సాగింది. పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసిన కిరణ్ అబ్బవరం ఈసారి ఖాకీ డ్రెస్సు సహాయం తీసుకున్నాడు. ఇమేజ్ ని మించిన పాత్రను ఎంచుకున్న  ఈ యూత్ హీరో ఎలా మెప్పించనున్నాడో చూడాలి మరి

This post was last modified on March 29, 2023 11:47 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

1 hour ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago