Movie News

జయ జానకి నాయక ప్రపంచ రికార్డు

అదేంటి ఎప్పుడో వచ్చిన సినిమా ఇప్పుడు కొత్తగా రికార్డులు సృష్టించడం ఏమిటనుకోకండి. ఇది అక్షరాలా నిజం. యుట్యూబ్ లో ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రీతిలో జయ జానకి నాయక 709 మిలియన్ల వ్యూస్ తో నెంబర్ వన్ స్థానంలో ఠీవిగా నిలుచుంది. అప్లోడ్ చేసిన నాలుగు సంవత్సరాలకే ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. తర్వాత ర్యాంకుల్లో దగ్గరగా కెజిఎఫ్ చాఫ్టర్ వన్ హిందీ డబ్ 692 మిలియన్లతో రెండో ప్లేస్ లో ఉంది.

మరే భారతీయ చిత్రాలు వీటి దరిదాపుల్లో లేవు. చరిత్ర సృష్టించిన షోలే, హం ఆప్కె హై కౌన్ లాంటివి కనీసం టచ్ చేసే సాహసం చేయలేదు. దీన్ని బట్టి మన డబ్బింగ్ మూవీస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజ్ లో నెత్తినబెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు అయిదు వందల మిలియన్ల క్లబ్బులో చేరిన వాటిలో కవచం, నేను శైలజ, హలో గురు ప్రేమ కోసమే, అఆ లాంటివి చాలానే ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్స్ సంగతి సరేసరి. సాయిశ్రీనివాస్ కోరిమరీ బాలీవుడ్ డెబ్యూ చేయడానికి కారణం ఇదే. ఆన్ లైన్లో, శాటిలైట్ ఛానల్స్ తన సినిమాలకు దక్కుతున్న విపరీతమైన ఆదరణ చూసే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ద్వారా అక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే రాజమౌళి కథను తీసుకున్నాడు.

ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక మన హీరోల పాత సినిమాలకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. ఓటిటిలు ఎక్కువయ్యాక ప్రతి సినిమా యూట్యూబ్ లో దొరకడం లేదు. చాలా మటుకు యాప్స్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప చూడలేని పరిస్థితి నెలకొంది. నిన్నా మొన్నటి దాకా అన్ని ఉచితంగా అందుబాటులో ఉంచిన ఈటీవీ ఇటీవలే డబ్బులు కట్టి చూడమనే ప్లాన్ ని లాంచ్ చేసింది. రాబోయే రోజుల్లో ఎంటర్ టైన్మెంట్ కి సంబంధించి ఫ్రీ అనే మాట ఉండకపోవచ్చు. మొత్తానికి జయ జానకి నాయక రీచ్ చూస్తుంటే బోయపాటి శీనుకి మాస పల్స్ మీద ఎంత పట్టుందో అర్థమవుతుంది.

This post was last modified on March 28, 2023 10:26 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago