తమిళ నటుడు విష్ణు విశాల్.. తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో కంటే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలను ప్రేమించి పెళ్లాడిన సెలబ్రెటీగానే ఎక్కువ పరిచయం. ఆ రకంగానే అతను ఇక్కడ ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. తెలుగులో రిలీజైన తన సినిమాలు ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ మంచి టాకే తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఏమంత మంచి ఫలితాన్నందుకోలేదు.
జ్వాల భర్తగా తెలుగు వాళ్ల దృష్టిలో పడుతూ వచ్చిన విష్ణు.. ఆమెను పెళ్లాడిన రెండేళ్లకే విడిపోతున్నట్లు వార్తలు రావడం కలకలం రేపింది. విష్ణు పెట్టిన ఒక ఇన్ డైరెక్ట్ పోస్టును జనాలు తప్పుగా అర్థం చేసుకోవడంతో ఈ దిశగా రూమర్లు ఊపందుకున్నాయి. ఇటీవల విష్ణు ఒక ట్వీట్లో.. నేను ఎంతో ప్రయత్నించాను. కానీ విఫలమవుతూనే ఉంటాను. మరేం పర్వాలేదు. దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటాను. ఈ ఓటమి పూర్తిగా నా తప్పే. దీన్నుంచి గుణపాఠం నేర్చుకుంటాను.. అని పేర్కొన్నాడు.
ఐతే దీన్ని తన వ్యక్తిగత జీవితానికి జనాలు ముడిపెట్టేశారు. ఆల్రెడీ ఒక పెళ్లి విఫలమై జ్వాలను రెండో పెళ్లి చేసుకున్నాడు విష్ణు. మరోవైపు జ్వాలకు కూడా ఇది రెండో వివాహం. వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోందని అనుకుంటుండగా ఇలాంటి నర్మగర్భమైన ట్వీట్ వేయడంతో జనాలకు విడాకుల గురించి సందేహాలు పుట్టుకొచ్చాయి. దీని గురించి జరుగుతున్న చర్చను చూసి విశాల్ స్పందించాడు. తాను వృత్తిగత జీవితం గురించి ఈ ట్వీట్ వేశానని.. దాన్ని వ్యక్తిగత జీవితానికి ముడి పెట్టి దారుణమైన ప్రచారం చేశారని.. జ్వాలతో తన ప్రయాణం అంతా బాగానే సాగుతోందని.. తమ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పూర్తినమ్మకం ఉందని అతను స్పష్టం చేశాడు
This post was last modified on March 29, 2023 12:15 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…