టాలీవుడ్ మోస్ట్ బిజీ అండ్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. మొన్నటిదాకా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉండేవాడు కానీ అడపాదడపా హిట్లే కానీ పెద్దగా చెప్పుకునే ఆల్బమ్స్ ఇవ్వకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ భరించే వాళ్ళు తప్ప ఇంకెవరూ సాహసం చేయడం లేదు. కానీ తమన్ కేసు వేరు. టాప్ లీగ్ లో ఉన్న అగ్ర తారలందరూ అతనే కావాలని కోరి మరీ తీసుకుంటున్నారు.
ఒక్క పవన్ కళ్యాణ్ కే వరసగా నాలుగు సినిమాలు చేయాల్సి రావడాన్ని బట్టి చెప్పొచ్చు డిమాండ్ ఏ స్థాయిలో పెరుగుతుందో. టాప్ బ్యానర్స్ ఏవి వచ్చినా నో అనకుండా ఒప్పేసుకుంటున్న తమన్ ఆ కారణంగానే క్వాలిటీ తగ్గించేస్తున్నాడనే కామెంట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొన్న సంక్రాంతికి రిలీజైన వారసుడులో ఒక పాట మాత్రమే ఛార్ట్ బస్టర్ అయ్యింది.
వీరసింహారెడ్డికి అఖండ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా బిజిఎం అంచనాలు అందుకోలేదు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎస్ఎస్ఎంని 28కి సంబంధించిన కంపోజింగ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ఈ కారణంగానే మహేష్ బాబు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు గుసగుసలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఇచ్చిన కొన్ని ట్యూన్స్ నచ్చలేదట.
గేమ్ చేంజర్, వినోదయ సితం రీమేక్, ఓజి, మహేష్ 28 ఇలా క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయి. ఒకపక్క ఇంత టైట్ షెడ్యూల్ లో ఉండి కూడా తమన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం రోజుల తరబడి విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకున్నాడనే విమర్శ కూడా చక్కర్లు కొడుతోంది. యాక్టర్లు ఎక్కువగా ఆడే ఆ మ్యాచ్ లో అఖిల్ తో సమానంగా తమన్ చాలా హడావిడి చేశాడు. కప్పు గెలిచారు కానీ దాని వల్ల టాలీవుడ్ కు ఒరిగేది ఏమి లేదు. అనిరుద్ రవిచందర్ తెలుగులో దూసుకురావాలని చూస్తున్న తరుణంలో తమన్ ఇకపై బెస్ట్ కాదు ఆల్ టైం గ్రేట్ ఇవ్వాల్సిందే
This post was last modified on March 28, 2023 1:43 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…