Movie News

హమ్మయ్యా.. ఛత్రపతికో డేట్ దొరికింది

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చారు. టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉండటమే దీనికి కారణమని తర్వాత బయట పడింది. ఎలాగోలా భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ పేరుని స్వంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

మే 12న థియేటర్లలో రాబోతున్నట్టు హీరో ముఖం చూపించకుండా కొత్త పోస్టర్ వదిలింది. దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ కొన్ని కీలకమార్పులు చేశారు
ఈ విషయంలో ఛత్రపతి బృందం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. మే 12న చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులు ఏమీ లేవు. దానికి రెండు వారాల ముందు ఆపై టూ వీక్స్ తర్వాత మొత్తం ఖాళీనే.

తెలుగులో నాగ చైతన్య కస్టడీ, తేజ సజ్జ హనుమాన్ లు ఉన్నాయి కానీ ఛత్రపతి హిందీకి తెలుగు మార్కెట్ తో పెద్దగా పని లేదు కాబట్టి కేవలం నార్త్ నే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఆ కోణంలో చూస్తే సాయిశ్రీనివాస్ కు మంచి డేట్ దొరికింది. కంటెంట్ కనక మాస్ ని మెప్పిస్తే ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. కాకపోతే ప్రభాస్ ని చూసిన కళ్ళతో సూపర్ అనిపించుకోవడం సులభం కాదు.

కేవలం దీనికోసమే బెల్లం హీరో మూడేళ్లు త్యాగం చేశాడు. బాడీ బిల్డ్ చేయడంతో పాటు ముంబైలోనే మకాం పెట్టేశాడు. యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నా సరే కోరిమరీ ఛత్రపతి చేయడం వెనుక కామెంట్స్ చాలానే వచ్చాయి. అసలే హిందీలో ఈ మధ్య వచ్చిన రీమేక్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయి. షెహజాదా, సెల్ఫీలాంటివి పేరున్న యాక్టర్లు స్టార్లు ఉన్నా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ముందు పెద్ద సవాలే ఉంది. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఆన్లైన్ లో, టీవీలో చూసిన సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అతని నమ్మకం ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

This post was last modified on March 27, 2023 1:16 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago