సినీ కుటుంబంలో అబ్బాయిలందరూ ఆటోమేటిగ్గా హీరోలైపోతారు. అమ్మాయిల సంగతి మాత్రం చెప్పలేం. మెగా కుటుంబంలోని అమ్మాయిల సంగతి చూస్తే.. కొణిదెల నిహారిక కథానాయికగా అడుగు పెట్టింది. కానీ సక్సెస్ కాలేక వెనక్కి వెళ్లిపోయింది. సుశ్మిత స్టైలిస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా తన ప్రయత్నాలేవో చేస్తోంది.
ఇక ఆ కుటుంబం నుంచి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అమ్మాయి అల్లు అర్హనే. అల్లు అర్జున్ ముద్దుల తనయురాలైన అర్హది చిన్న వయసే. కానీ అప్పుడే ఆమె తెరంగేట్రం చేసేస్తోంది. ‘శాకుంతలం’ సినిమాలో అర్హ కీలక పాత్రలో మెరవబోతున్న సంగతి తెలిసిందే. టీజర్లో ఆమె సింహాం మీద వస్తున్న దృశ్యం హైలైట్ అయింది. సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన సమంత.. అర్హకు మంచి ఎలివేషనే ఇచ్చింది.
అల్లు అర్హ బోర్న్ సూపర్ స్టార్ అని సమంత ఎలివేషన్ ఇవ్వడం విశేషం. ‘‘అల్లు అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులను అభినందించాలి. ఎంత పెద్ద డైలాగైనా చాలా తేలికగా చెప్పేస్తుంది. తన సీన్ వచ్చినపుడల్లా నాకు చాలా ముచ్చటేసి తెలియకుండానే నవ్వుకునేదాన్ని. మొదటి రోజు షూటింగ్‌లో వంద మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నా.. అంతమందిలో అర్హ ఎలాంటి భయం లేకుండా తన డైలాగులను ధైర్యంగా చెప్పేసింది. అర్హకు నటనలో శిక్షణ అవసరం లేదు. తను పుట్టుకతోనే సూపర్ స్టార్’’ అని సామ్ పేర్కొంది. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 27, 2023 6:28 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…