ఇక్కడ టాలీవుడ్ అభిమానులేమో.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరికి ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని కొట్టేసుకుంటూ ఉంటే.. అసలు ఈ పాటతో సంబంధమే లేని అజయ్ దేవగణేమో.. తన వల్లే ఈ పాటకు అకాడమీ పురస్కారం వచ్చిందని స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
అజయ్ ‘ఆర్ఆర్ఆర్’లో భాగం అయినప్పటికీ.. ‘నాటు నాటు’ పాటకు, ఆయనకు ఏ సంబంధం ఉండదు. అజయ్ పాత్ర వచ్చేది ఫ్లాష్ బ్యాక్‌లో రామ్ చరణ్ పాత్ర చిన్న వాడిగా ఉండగా. ఈ పాటేమో వర్తమానంలో చరణ్ పెద్దవాడయ్యాక వస్తుంది. అయినా తన వల్లే ఈ పాటకు ఆస్కార్ వచ్చిందని వ్యాఖ్యానించాడు అజయ్. కాకపోతే ఆయన ఈ మాట అన్నది సరదాగానేలెండి.
తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘భూళా’ ప్రమోషన్లలో భాగంగా అజయ్.. కపిల్ శర్మ కామెడీ షోకు వచ్చాడు. ఈ సందర్భంగా మీరు నటించిన ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది కదా అంటూ అభినందనలు తెలిపాడు కపిల్.
ఇంతలో అజయ్ అందుకుని.. “నా వల్లే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది” అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతుండగా.. “ఒకసారి ఊహించుకోండి.. నేను ఆ పాటకు డ్యాన్స్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో” అంటూ తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు. తాను డ్యాన్స్ చేయకుండా వదిలేశాను కాబట్టి.. తారక్, చరణ్ చేశారు కాబట్టే ఈ పాట అంత పెద్ద హిట్టయి ఆస్కార్ అవార్డు గెలిచే వరకు వెళ్లిందని.. కాబట్టి అవార్డు రావడానికి తనే కారణం అన్నది అజయ్ ఉద్దేశం. ఈ కామెంట్ చూసి అజయ్ సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘భూళా’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 25, 2023 12:02 pm
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…