మైత్రిలో ‘అన్నం’.. అంతా అబద్దం

కృష్ణ వంశీ ఒక మంచి సినిమాతో ఎప్పుడెప్పుడు కం బ్యాక్ ఇస్తాడా ? అని ఎదురుచూసిన మూవీ లవర్ కి ‘రంగమార్తాండ’ అ లోటు తీర్చేసింది. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణ వంశీ తన నెక్స్ట్ సినిమా ‘అన్నం’ ను మైత్రి లో చేయబోతున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తాజాగా దీనిపై దర్శకుడు కృష్ణ వంశీ స్పందించాడు. అన్నం సినిమాను మైత్రి బేనర్ లో చేయబోతున్నట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. రంగమార్తాండ ను వాళ్ళు రిలీజ్ చేయడం వల్లే ఆ రూమర్ వచ్చిందని భావిస్తున్నా అంటూ చెప్పుకున్నారు. నెక్స్ట్ సినిమాగా అన్నం చేయబోతున్నాని దాని డీటైల్స్ త్వరలోనే చెప్తానని అన్నారు.

అయితే అన్నం సినిమా మన కథ. మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అన్నది మాత్రం చెప్పగలను అంటూ తెలిపారు వంశీ. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైక వెళ్తుందో చెప్పలేనని మన చేతిలో ఏం ఉండదని అంతా డెస్టినీ నిర్ణయిస్తుందని వేదాంతం పలికారు.