‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత అతడికి సరైన సినిమాలు పడలేదు కానీ.. లేదంటే ఇండియాలో అతణ్ని కొట్టే హీరో లేడు అన్నట్లే ఉండేది. కానీ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలతో తన రేంజి మారిపోతుందని.. తిరిగి ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో ట్యాగ్ వేయించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రభాస్ నటిస్తున్న వాటిలో ‘సలార్’ మీద మామూలు అంచనాలు లేవు. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే దాని వసూళ్ల ప్రభంజనానికి ఆకాశమే హద్దవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా మీద మేకర్స్ కాన్ఫిడెన్స్ కూడా మామూలుగా లేదు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లబోతున్నట్లు ఇటీవలే వార్త బయటికి వచ్చింది.
ప్రభాస్ ‘ప్రాజెక్ట్-కే’ లాంటి చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదుగుతాడని అనుకున్నారు కానీ.. అంతకంటే ముందు ‘సలార్’తోనే ఆ రేంజిని అందుకోబోతుండటం పట్ల అభిమానులు అమితానందంతో ఉన్నారు. ఐతే ‘సలార్’ను అంతర్జాతీయ స్థాయిలో మొక్కుబడిగా రిలీజ్ చేయడం కాకుండా పక్కా ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగుతోంది టీం.
ఈ సినిమా ఇండియన్ వెర్షన్లు రిలీజయ్యాక.. కొంచెం లేటుగా ఇంటర్నేషనల్ కట్ రిలీజ్ చేయడం లాంటిదేమీ చేయట్లేదు. ముందే ఇంగ్లిష్ వెర్షన్ రెడీ అయిపోతోందట. ఇండియా రిలీజ్‌తో పాటు ఆ వెర్షన్ అంతర్జాతీయ స్థాయిలో సందడి చేయనుందట. పాటలు, కొన్ని డ్రమటిక్ సన్నివేశాలు తీసేసి.. నిడివి అరగంట దాకా తగ్గించి ప్రాపర్ హాలీవుడ్ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇంగ్లిష్ వెర్షన్ చాలా పక్కాగా రెడీ అయి.. ఇండియన్ వెర్షన్‌తో పాటే అంతర్జాతీయ స్థాయిలో సందడి చేయనుందట. ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 24, 2023 4:12 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…