సెలబ్రెటీల్లో చాలామంది రెండో పెళ్లి చేసుకున్న వాళ్లే కానీ.. పెళ్లిళ్లలో అంతకుమించి నంబర్ పెరిగితే మాత్రం కౌంటర్లు తప్పవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో తరచుగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం అయినా సరే.. పబ్లిక్ ఫిగర్ల మీద కౌంటర్లు పడుతుంటాయి.
ఐతే తాజాగా ఓ సీనియర్ నటుడిని ఇంకో సీనియర్ ఒక వేదిక మీద నిత్య పెళ్లికొడుకు అనేయడం.. ఆ వ్యక్తి దాన్ని చాలా సరదాగా తీసుకోవడం విశేషం. ఇక్కడ కౌంటర్ వేసింది రాజేంద్ర ప్రసాద్ కాగా.. వేయించుకున్నది నరేష్. వీళ్లిద్దరూ కలిసి నటించిన అన్నీ మంచి శకునములే సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ ఈవెంట్లో ఈ చిత్రం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు పంచెకట్టులో పెళ్లికొడుకు లాగే తయారై వచ్చాడు నరేష్.
ఆయన ఇటీవలే పవిత్ర నరేష్‌ను పెళ్లాడిన వీడియోను తనే ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇది నిజం పెళ్లా.. సినిమా పెళ్లా అనే విషయంలో కొంత సందిగ్ధత కూడా నడిచింది. ఆ విషయం పక్కన పెడితే నరేష్‌కు ఇంతకుముందే మూడు పెళ్లిళ్లయ్యాయి. ఇది నాలుగో పెళ్లి. ఈ సంగతిలా ఉంచితే.. అన్నీ మంచి శకునములే ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్‌కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవంటారు.. కానీ మీరు, నరేష్ కలిసి ఈ సినిమాలో నటించారు.. దీనిపై మీరేమంటారు అని అడగ్గా.. ”నేను కత్తి కాదు. నరేష్ కత్తి. నేను ఒర. వాడు మామూలోడు కాదు. మీ అందరికీ తెలుసు. ఆ రేంజ్ కతత్ఇ. మేం కాదు.. చూశారా.. ఎప్పుడూ పెళ్లి కొడుకు లాగానే ఉంటాడు” అంటూ నరేష్ వైపు చూపిస్తూ నవ్వాడు రాజేంద్ర ప్రసాద్. దీనికి నరేష్ స్పందిస్తూ.. పెళ్లికొడుకులా ఉండటం ఏంటి, పెళ్లికొడుకునే అనడంతో ఆ ప్రాంగణం నవ్వుల్లో మునిగిపోయింది.
This post was last modified on March 23, 2023 7:35 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…