ఇంకొద్ది గంటల్లో దాస్ కా ధమ్కీ థియేటర్లలో అడుగు పెట్టనుంది. సహజంగానే ఎనర్జీతో పరుగులు పెట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో స్వంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కావడంతో ప్రతి మాటలోనూ చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో మొదలుపెట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఊపిరి సలపలేరని ఇప్పటిదాకా ఎవరూ ఇవ్వని ఎక్స్ పీరియన్స్ కలగజేస్తానని హామీ ఇస్తున్నాడు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఎలివేషన్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా లేకపోయినా టాక్ తో పికప్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది.
దాస్ కా ధమ్కీ థియేట్రికల్ టార్గెట్ చిన్నదేమీ కాదు. ఏడున్నర కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. అంటే షేర్ ఎనిమిది కోట్లు వస్తే హిట్టు ముద్ర వేయొచ్చు. సానుకూలాంశం ఏంటంటే రేపు పెద్దగా పోటీ లేదు. రంగమార్తాండ మీద ఎంత ప్రీ పాజిటివ్ టాక్ ఉన్నా అది మాస్ ని లక్ష్యంగా చేసుకోలేదు. ఆ మాటకొస్తే ఆ వర్గానికి నచ్చే అవకాశాలూ తక్కువే. అది ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ధమ్కీకి యూత్ సపోర్ట్ ని ఆశించొచ్చు. అయితే ఇది కూడా మూవీ బాగుందనే ప్రచారం వస్తేనే దక్కుతుంది కానీ మార్నింగ్ షోలన్నీ హౌస్ ఫుల్స్ తో మొదలవ్వవు.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కావాల్సినన్ని స్క్రీన్లు దక్కించుకున్న ధమ్కీకి నాని దసరా వచ్చే దాకా నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉంటుంది. వీలైనన్ని వసూళ్లు రాబట్టుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు రోజులకు ఎనిమిది కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. బలగం లాంటి ఎమోషనల్ మూవీనే అంత గొప్పగా రాబట్టగలిగినప్పుడు ధమ్కీకి అదేమీ కష్టం కాదు. ఓరి దేవుడా టైపులో పర్వాలేదనిపించుకుంటే సరిపోదు. అదిరిపోయిందనే అనిపించాలి. ఏ మాత్రం తగ్గినా సవాళ్లు ఎదురవుతాయి. మరి దాస్ ధమ్కీ ఇస్తాడో తీసుకుంటాడో రేపీపాటికి తేలిపోతుంది.
This post was last modified on March 21, 2023 3:27 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…