ఒకప్పుడు తాము చిన్న తెరల్ని అడ్డుపెట్టుకుని.. చెట్ల వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకునేవాళ్లమని.. అప్పట్లో ఏ వసతులూ ఉండేవి కావని ముందు తరం నటీనటులు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఈ రోజుల్లో ఆర్టిస్టులకు అలాంటి సమస్య లేదు. ఓ మోస్తరు స్థాయి ఉన్న వాళ్లందరికీ కారవాన్లు ఇచ్చేస్తున్నారు. అవి కాకపోయినా బట్టలు మార్చుకోవడానికి.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందుబాటులో వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లోనే కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ తాను బండ రాళ్ల మధ్యన కాలకృత్యాలు తీర్చుకున్నట్లు చెప్పడం గమనార్హం.
“గతంలో నేను రంగూన్ అనే సినిమాలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లు, రెస్ట్ రూంలు లేవు. దీంతో పెద్ద పెద్ద రాళ్ల వెనక్కి వెళ్లి యూనిట్ సభ్యులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ నాక్కూడా ఇలా చేయక తప్పలేదు. అప్పట్లో నాకు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి. అందుకే తర్వాతి కాలంలో నేనొక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేశా” అని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇదిలా ఉండగా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పెట్టిన ఓ ట్వీట్ మీద స్పందిస్తూ కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనంత నాటకీయ జీవితం ఎవరికీ ఉండదని.. ఓ ప్రేమ వ్యవహారం కారణంగా మొత్తం సినిమా మాఫియా అంతా కలిసి తనను జైలుకు పంపించడానికి ప్రయత్నించిందని పరోక్షంగా హృతిక్ రోషన్ అండ్ కో మీద ఆరోపణలు చేసింది కంగనా.
This post was last modified on March 20, 2023 11:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…