మెగా బ్రదర్ నాగ బాబు తనయ నీహారికకు తన భర్త చైతన్యతో ఏవో అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇన్స్ స్టాగ్రామ్ లో పరస్పరం ఒకరినొకరు తాము కలిసున్న ఫోటోలను డిలేట్ చేయడం, గత కొంత కాలంగా జోడిగా ఉన్న పిక్స్ ఏవీ పోస్ట్ చేయకపోవడం వీటికి ఊతమిస్తోంది. నీహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. హలో వరల్డ్ లాంటి వెబ్ సిరీస్ లు తీశారు. చైతన్య కూడా యాక్టివ్ గా ఆ వ్యవహారాల్లో పాలు పంచుకున్నాడు. గతంలో అతన్ని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నం జరుగుతోందనే వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే ఇప్పుడీ న్యూస్ గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సైతం కళ్యాణ్ దేవ్ తో బ్రేకప్ చేసుకుందన్న వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. దానికి అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ అతను ఉన్నట్టుండి సైలెంట్ కావడం, కొత్త సినిమాలేవీ మొదలుకాకపోవడం వాటికి బలం చేకూర్చాయి. చిరంజీవితో సహా ఎవరూ దీని గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగబాబు నీహారిక ఇష్యూ గురించి ఏమైనా రెస్పాన్స్ ఇస్తారేమో చూడాలి.
ఇదేదో మెగా ఫ్యామిలీకి శాపంగా మారినట్టు ఉందని అభిమానులు కామెంట్స్ లో నిజం లేకపోలేదు. వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేయాలని చూస్తున్న నాగబాబుకి ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే. ఇది నిర్ధారణగా ఎవరూ చెప్పని విషయమే అయినా కనిపిస్తున్న వాస్తవాన్ని దాచలేరుగా. మూడేళ్ళ క్రితం 2020లో ఒక్కటైన ఈ జంట పెళ్లిని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఇంత తక్కువ గ్యాప్ లో అపార్థాలంటే ఆశ్చర్యమే. గత కొన్నేళ్లలో చైతు సమంతలు విడిపోవడం పెద్ద టాపిక్ అయ్యింది. నీహారిక జంటకు ఆ స్థాయి లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ వల్ల చర్చకు దారి తీస్తోంది.
This post was last modified on March 20, 2023 10:45 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…