బుచ్చిబాబు సినిమా గురించి చరణ్ ఎలివేషన్లు

ఆస్కార్ సంరంభం పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చిన రామ్ చరణ్ ఇండియా టుడే సంస్థ నిర్వహించే కాంక్లేవ్ కోసం ఢిల్లీలో దిగి అది పూర్తి చేసుకుని నిన్న రాత్రి బాగా ఆలస్యమయ్యాక బేగంపేట్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు. కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా దేశ రాజధానికి వెళ్లిన చిరంజీవి అక్కడే పలువురు ప్రభుత్వ పెద్దలు మంత్రులతో పాటు అమిత్ షాని కలిసి చరణ్ తో ఫోటోలు దిగడం ఆల్రెడీ వైరల్ అయ్యాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ చరణ్ లు ఒకే స్టేజిని పంచుకుంటారన్న వార్త నిజం కాలేదు. పైన చెప్పిన మీడియా ఈవెంట్ లో చరణ్ సోలోగానే ఉన్నాడు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకున్నాడు చరణ్. ముఖ్యంగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఇంకా ప్రారంభమే కానీ సినిమా గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చేశాడు. సబ్జెక్టు చాలా డిఫరెంట్ గా ఉంటుందని, తన బెస్ట్ మూవీస్ లో ఒకటైన రంగస్థలంని మించి ఇందులో పెర్ఫార్మన్స్ కి స్కోప్ దక్కబోతోందని, ఈ కథ కేవలం భారతీయులకే కాక వెస్ టర్న్ ఆడియన్స్ ని మెప్పించేలా చాలా స్పెషల్ గా ఉంటుందని వివరించాడు. నిజానికి ఫ్యాన్స్ ఆర్సి 15, శంకర్ టేకింగ్ గురించి ఏమైనా స్పెషల్ న్యూస్ చెబుతాడేమోనని ఎదురు చూశారు.

తీరా చూస్తే బుచ్చిబాబు గురించి చెప్పేసరికి ఒకరకంగా షాక్ తిన్నారు. మొత్తానికి రంగస్థలంకి మించి అని చెప్పడం ద్వారా ఇంకోసారి విలేజ్ డ్రామా చేయబోతున్న హింట్ అయితే ఇచ్చేశాడు. సెప్టెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని కూడా చెప్పేశాడు కాబట్టి శంకర్ మూవీని దసరాలోపే పూర్తి చేయబోతున్న క్లారిటీ వచ్చేసింది. నిర్మాత దిల్ రాజు ఆశిస్తున్నట్టు  2024 సంక్రాంతి బరిలో దింపే ఛాన్స్ మెరుగయ్యింది. ఈ నెలాఖరులో చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లాంచ్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. సీఈఓ పేరు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనట