Movie News

హీరో లేకుండా కాజల్ దెయ్యం సినిమా

పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా కాజల్ అగర్వాల్ కు అవకాశాలు వస్తున్నాయి. వివాహానికి ముందే కమల్ హాసన్ ఇండియన్ 2 ఒప్పుకోవడంతో ప్రస్తుతం దాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబోలో కూడా తనే కథానాయిక. అఫీషియల్ గా ఇంకో వారం పది రోజుల్లో ప్రకటన రావొచ్చు. ఇదిలా ఉండగా తన కొత్త సినిమా ఒకటి గుట్టుచప్పుడు కాకుండా రిలీజ్ కు రెడీ కావడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఘోస్టీ టైటిల్ తో రూపొందిన ఈ కామెడీ హారర్ డ్రామాని ఇవాళ తమిళంలో విడుదల చేశారు. వారం తర్వాత తెలుగు డబ్బింగ్ రాబోతోంది.

ఇందులో కాజల్ అగర్వాల్ పోలీస్ అధికారిగా నటిస్తోంది. కొందరు షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు తమ చిత్రంలో నటించమని అడిగితే ఒప్పుకున్న కాజల్ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒకరిని కాల్చడం వల్ల హత్యకు కారణమవుతుంది. ఆ చనిపోయిన వ్యక్తి దెయ్యం రూపంలో ఆమె వెంట పడుతూ ఇంటికి వచ్చేస్తాడు. దీంతో అక్కడి నుంచి కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ ఈ మర్డర్ ఎలా జరిగింది ఆ ఆత్మ ఎందుకు కాజల్ చుట్టూ తిరిగిందనే పాయింట్ మీద ఘోస్టీ రూపొందింది. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో యోగిబాబు, ఊర్వశి, ఆడుకాలం నరేన్ లాంటి పెద్ద అరవ క్యాస్టింగ్ ఉంది.

అంతా బాగానే ఉంది కానీ ఇంత హఠాత్తుగా ప్రమోషన్లకు కనీస టైం తీసుకోకుండా రిలీజ్ చేయడమే కామెడీగా ఉంది. తమిళంలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. గత వారం వచ్చిన జయం రవి అగిలన్ డిజాస్టర్ అయ్యింది. ధనుష్ వాతి ఎప్పుడో నెమ్మదించేసింది. అందుకే ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకుందామని హఠాత్తుగా బరిలో దూకేసింది. రిపోర్ట్స్ సైతం ఏమంత ఆశాజనకంగా లేవు. మరి వచ్చేవారం టాలీవుడ్ లో విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ, కృష్ణవంశీ రంగమార్తాండలను కాచుకోవాల్సి ఉంటుంది. అసలు ఇందులో హీరోనే లేకపోవడం ఫైనల్ ట్విస్టు

This post was last modified on March 17, 2023 10:09 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago