90వ దశకంలో అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెరిసిన పొన్నాంబళంను అంత సులువుగా మరిచిపోలేం. మరీ లెంగ్త్ ఉన్న, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయలేదు కానీ.. హీరోను ఢీకొట్టే రౌడీ పాత్రల్లో పొన్నాంబళం మంచి గుర్తింపే సంపాదించాడు. చూడటానికి చాలా క్రూరంగా కనిపించే పొన్నాంబళంను చూసి అప్పటి ప్రేక్షకులు జడుసుకునేవారు. అతడి పాత్రలు కూడా అలా ఉండేవి మరి.
తెర మీద ఇలా క్రూరంగా కనిపించేవాళ్లు చాలామంది బయట సున్నిత మనస్కులుగా ఉంటారు. పొన్నాంబళం కూడా అందుకు మినహాయింపు కాదు. బయట ఆయన మాట తీరు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ప్రస్తుతం పొన్నాంబళం తెలుగు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ మధ్య పొన్నాంబళం కిడ్నీ వ్యాధితో విషమ స్థితికి చేరగా.. అత్యవసర స్థితిలో చిరు సాయంతో కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి.
దీని గురించి పొన్నాంబళం చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సాయం కోరుతూ మెసేజ్ పెడితే లక్షో రెండు లక్షలో ఇస్తారనుకుంటే.. తన కోడలు ఉపాసన పుట్టింటి వారు నడిపే అపోలో ఆసుపత్రిలో తనను చేర్పించి 40-45 లక్షలు ఖర్చుతో వైద్యం చేయించి మొత్తం బిల్లు చిరునే కట్టిన విషయాన్ని పొన్నాంబళం వెల్లడించడంతో మెగాస్టార్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాను తీవ్ర అనారోగ్యం పాలవడానికి బయట అనుకుంటున్న కారణాలు నిజం కాదని పొన్నాంబళం ఈ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. అందరూ తాను మద్యం తాగి కిడ్నీలు పాడు చేసుకున్నట్లు భావిస్తున్నారని.. తన మీద విష ప్రయోగం జరగడం వల్ల కిడ్నీలు పాడయ్యాయని అతను తెలిపాడు. తన తండ్రికి నలుగురు భార్యలని.. అందులో ఒక భార్య కొడుకు తన దగ్గరే మేనేజర్‌గా పని చేసేవాడని.. సొంత తమ్ముడే కదా అని అతణ్ని ఎంతో నమ్మానని.. కానీ అతను తాను తాగే బీర్‌లో స్లో పాయిజన్ కలిపి తన ఆరోగ్యం దెబ్బ తినేలా చేశాడని.. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పొన్నాంబళం వెల్లడించాడు.
This post was last modified on March 16, 2023 2:01 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…