రంగంలోకి దిగిన సమంత

శాకుంతలం షూటింగ్ పూర్తయి చాలా నెలలవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు గుణశేఖర్. ముఖ్యంగా సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి నుండి సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫైనల్ గా సినిమా వచ్చే నెల థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ట్రైలర్ రిలీజ్ తో హంగామా చేసిన యూనిట్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. సమంత వెబ్ సిరీస్ తో బిజీ అయిపోవడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

తాజాగా సమంత రంగంలోకి దిగింది. శాకుంతలం ఫస్ట్ కాపీ చూసిన సామ్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని రోజులు కేటాయించబోతుంది. సమంత పెద్దమ్మ గుడి నుండి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసింది. టీంతో కలిసి పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఇక నుండి శాకుంతలం ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు సంకేతమిచ్చింది.

అయితే సమంత నటించిన ఈ పాన్ ఇండియా సినిమాకు అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేయాల్సి ఉంది. సమంత తన టీంతో కలిసి ముఖ్యమైన ప్రదేశాలలో ప్రెస్ మీట్స్ , ఈవెంట్స్ లో పాల్గొనాలి. ప్రస్తుతం నాని దసరా ప్రమోషన్స్ కోసం కేరళ నుండి లక్నో వరకూ తిరుగొచ్చాడు. ఇప్పుడు సమంత కూడా అదే దారిలో వెళ్ళి పాన్ ఇండియా లెవెల్ లో తన శాకుంతలంను ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. యశోదతో సూపర్ హిట్ కొట్టిన సమంత ఈ సినిమాతో మరో హిట్ కొడితే ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.