Movie News

100 కోట్ల సినిమాకి బజ్ లేదేంటి

శాండల్ వుడ్ టాప్ స్టార్స్ ముగ్గురు ఉపేంద్ర – కిచ్చ సుదీప్ – శివరాజ్ కుమార్ కలిసి నటించిన ప్యాన్ ఇండియా మూవీ అది కూడా నూటా ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందినప్పుడు దాని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉండాలి. ఏదో ఆషామాషీ కమర్షియల్ సినిమా అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన కబ్జా విషయంలో అలాంటి హడావిడి కనిపించడం లేదు. కెజిఎఫ్ రేంజ్ లో ట్రైలర్ లో బిల్డప్ గట్రా ఉన్నప్పటికీ ఎందుకో మరి ఆడియన్స్ దీని మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధాన నగరాలు మొదలుకుని అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా ఉన్నాయి.

ఉపేంద్ర అంతా తానై అన్ని చోట్ల తిరుగుతున్నాడు. తెలుగులో సాంగ్ లాంచ్, ప్రెస్ మీట్ అన్నీ చేశాడు. ప్రతి చోటా హీరోయిన్ శ్రేయ వెన్నంటే ఉంది. చెన్నైకు వెళ్లి తమిళంలో మాట్లాడి అక్కడి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ విచిత్రంగా కిచ్చ సుదీప్ మాత్రం దేనికీ రాలేదు. తనది ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రే. శివ రాజ్ కుమార్ ది ఫుల్ లెన్త్ కాకపోయినా క్యామియోగానే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. స్వాతంత్ర సమరం జరుగుతున్న కాలంలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వదిలేసి గ్యాంగ్ స్టర్ గా మారిన ఒక వ్యక్తి కథగా కబ్జాని తెరకెక్కించారు.

దర్శకుడు చంద్రుకి కన్నడలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇతని చివరి చిత్రం 2019లో వచ్చిన ఐ లవ్ యు. ఇందులో కూడా ఉపేంద్రనే హీరో. ఆ తర్వాత నుంచి పూర్తిగా కబ్జా మీద పని చేస్తున్నాడు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. పోనీ కర్ణాటకలో భీభత్సమైన ప్రీ హైప్ ఉందా అంటే ప్రస్తుతానికి కనిపించడం లేదు. బెంగళూరు ఫస్ట్ డే టికెట్లు సులభంగానే అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాటికి వేసే తెల్లవారుఝాము షోలు ఇంకా ప్లాన్ చేయలేదు. ఉపేంద్ర పడిన ఇంత పెద్ద కష్టానికైనా కబ్జా ఏదో అద్భుతం చేయాల్సిందే.

This post was last modified on March 14, 2023 4:27 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

10 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago