Movie News

మాస్ ఇమేజ్ కోసమా ఇంత పెద్ద ప్లాను

అప్ కమింగ్ కుర్ర హీరోలకు మాస్ ఇమేజ్ రావాలంటే కొంత టైం పడుతుంది. సరైన దర్శకుడు కాంబో అన్నిటిని మించి కథ పడాలి. అప్పుడే ఫాలోయింగ్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ సైతం సుస్వాగతం నుంచి ఖుషి దాకా ఎక్కువ లవ్ స్టోరీలే చేశాడు. స్వంత టాలెంట్ ఎంత ఉన్నా మొదట్లో మెగా బ్రాండ్ అండ బాగా ఉపయోగపడింది. నితిన్, రామ్ లాంటి వాళ్ళుకు అంత ఈజీగా జరగలేదు. నాని పాతిక సినిమాలు దాటాకే ఊర మాస్ దసరాతో వస్తున్నాడు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఈ లెక్కలకు అతీతంగా వేగంగా మాస్ నిచ్చెన ఎక్కడానికి పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తోంది.

ఆ మధ్య నేను మీకు బాగా కావాల్సినవాడినిలో కమర్షియల్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. సబ్జెక్టుతో పాటు టోటల్ కాన్సెప్టే తేడా కొట్టేసింది. వినరో భాగ్యము విష్ణు కథ లాంటి డీసెంట్ స్టోరీలోనూ శ్రీమంతుడు టైప్ ఫైట్లు గట్రా పెట్టేశారు. భారీగా కాదు కానీ ఓ మోస్తరుగా ఆడేసి పాస్ మార్కులు దక్కించుకుంది. ఇప్పుడు మీటర్ తో రాబోతున్నాడు. దీని లిరికల్ సాంగ్ ని రేపు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఇరవై థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారు వాటిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ వే ఉండటం గమనార్హం. హైదరాబాద్ లేకపోవడం మరో ట్విస్టు.

ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా తనకు థియేటర్ మాస్ ఫాలోయింగ్ బలంగా ఉందన్న సందేశం జనంలోకి వెళ్తుందన్న ఉద్దేశం కావొచ్చు. మీటర్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామి కావడం ఇంత మార్కెటింగ్ కు కారణంగా కనిపిస్తోంది. ఊర మాస్ పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ అబ్బవరం తన ఇమేజ్ కి మించిన పెద్ద పాత్రే చేస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. పాటకే ఇంత పెద్ద స్కేల్ ని ప్లాన్ చేస్తే ట్రైలర్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏం చేస్తారో మరి. ఏప్రిల్ 7 విడుదల కాబోతున్న మీటర్ కు రవితేజ రావణాసురతో పాటు దగ్గబాటి అభిరాం అహింస పోటీలో ఉంది.

This post was last modified on March 14, 2023 2:19 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

5 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

9 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

10 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

11 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

12 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

12 hours ago