కోట్లాది భారతీయ సినిమా ప్రేమికుల ఆకాంక్షలు ప్రార్థనలు ఫలించాయి. ఆస్కార్ కు అధికారికంగా నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకుగాను సగర్వంగా అకాడెమి పురస్కారం దక్కించుకుంది. దీనికన్నా ముందు హోరెత్తే కరతాళ ధ్వనుల మధ్య వివిధ దేశాలకు చెందిన డాన్సర్లు స్టేజి మీద నాటు నాటుకి లైవ్ లో పెర్ఫార్మ్ చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవల లయబద్ధ గాత్రానికి అలా నృత్యాలు చేస్తుంటే చూసేందుకు రెండు కళ్ళు చాలలేదంటే అతిశయోక్తి కాదు. పాట పూర్తవ్వగానే స్టాండింగ్ ఒవేషన్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
దీనికి ముందు దీపికా పదుకునే ఇచ్చిన వ్యాఖ్యానం, ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల నేపథ్యం గురించి ఉదహరించిన తీరు గొప్పగా సాగింది. ఉదయం అయిదు గంటల నుంచే టీవీ సెట్ల ముందు అతుక్కుపోయిన అభిమానులు మూడు గంటలకు పైగా నాటు నాటు అనౌన్స్ మెంట్ కోసం ఓపిగ్గా ఎదురు చూశారు. ఆ క్షణం రానే వచ్చింది. దర్శకుడు, నటీనటులు, సినిమా, సాంకేతిక విభాగం ఇలా ఎన్నిటి మీదో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఫైనల్ గా నాటు నాటుకి మాత్రమే నామినేషన్ దక్కడం కొంత లోటుగా అనిపించినా ఎందరో మహామహుల వల్ల కానిది రాజమౌళి సాధ్యం చేసి చూపించడంతో కొత్త శకానికి నాంది పలికినట్టు అయ్యింది
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీతరచయిత చంద్రబోస్ ఇకపై దగ్గరలో మళ్ళీ ఈ ఘనత ఇంకెవరూ సాధించలేరేమో అన్నంత ఒక అద్భుత ఘట్టంలో భాగమయ్యారు. టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎన్నో గొప్ప మైలురాళ్లు అందుకున్నప్పటికీ ఈ రోజు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మహామహా దిగ్గజాలు అందుకోలేని గౌరవం ఇవాళ ఈ ఇద్దరూ సొంతం చేసుకున్నారు. నెలల తరబడి ఆర్ఆర్ఆర్ ని గ్లోబల్ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు రాజమౌళి కష్టానికి ఇది పూర్తి ప్రతిఫలం కాకపోయినా చిన్నది చేసేది మాత్రం ఖచ్చితంగా కాదు. ఒక తెలుగు పాట ఇంటర్నేషనల్ స్టేజి మీద ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నభూతో నభవిష్యతి.
This post was last modified on %s = human-readable time difference 8:36 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…