Movie News

త‌మ్మారెడ్డికి నాగ‌బాబు రిట‌ర్న్ కౌంట‌ర్

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్ర‌మోష‌న్ కోసం 80 కోట్లు వృథాగా ఖ‌ర్చు పెట్టారు అన్న‌ట్లు సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చేసిన వ్యాఖ్య‌ల‌పై మొద‌లైన వివాదం తీవ్ర రూపం దాలుస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను రాఘ‌వేంద్ర‌రావు, నాగ‌బాబు త‌దిత‌రులు తీవ్రంగా త‌ప్పుబ‌ట్ట‌డం.. దీనికి త‌మ్మారెడ్డి కౌంట‌ర్ ఇవ్వ‌డం తెలిసిందే. ఐతే త‌న వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన త‌మ్మారెడ్డికి నాగ‌బాబు తిరిగి కౌంట‌ర్ ఇచ్చారు. ఈసారి మ‌రింత తీవ్ర వ్యాఖ్య‌లే చేశాడు నాగ‌బాబు. ఒక వీడియో రూపంలో నాగ‌బాబు త‌మ్మారెడ్డికి ఇచ్చిన స‌మాధానం ఏంటంటే…

”ఆస్కార్ బరిలో మన తెలుగు సినిమా ఉన్నందుకు గర్వపడాలి. నాటు నాటు అంటూ ప్రపంచంలో తెలుగోడి పాట వినిపిస్తుంది. ఆస్కార్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్‌కి అవార్డ్ వస్తే.. తెలుగోడు తలెత్తుకుంటాడు. ఒకవేళ ఆస్కార్ రాకపోయినా.. పోటీలో ఉన్నాం అని గర్వంగా చెప్పుకోవచ్చు. గొప్ప సినిమాలో గొప్ప పాట ఆస్కార్ రేంజ్‌కి వెళ్లిందంటే ఎంత గొప్ప విషయం. ఇదిరా మన తెలుగోడి సత్తా.. ఇదిరా మా భారతీయుడి సత్తా అని జబ్బలు చరుస్తూ గర్వంగా నిలబడాలి కానీ.. ఆస్కార్‌ బరిలో ఆర్ఆర్ఆర్ ఉన్నందుకు కుళ్లుకుని చచ్చిపోవడం ఎందుకు? మెచ్చుకోవడం అనే సంస్కారం కొంతమందికి లేకపోవచ్చు. సినిమాలు మానేసి.. ప్రొడక్షన్ మానేసి.. రిటైర్డ్ అయిపోయిన బ్యాచ్ మనది. మన వల్ల కనీసం కుక్కకి కూడా ఉపయోగం లేదు. ఊరికే వీడియోలు పెట్టి కథలు చెప్పడం.. కెమెరా కనిపిస్తే పెద్ద అనలిస్ట్‌లా మాట్లాడి.. మేధావిలా మాట్లాడితే జనం అభినందిస్తారని అనుకుంటున్నాడు.

అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీశావ్.. అందులో ఎన్ని హిట్లు ఉన్నాయి. అసలు నువ్వు నీ సినిమాలో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్ ఇచ్చావా? అవన్నీ మాట్లాడితే చాలా ఉంటాయి. ఇప్పటికే రాజకీయం చేస్తూ చాలా పనికిమాలిన విమర్శలు చేశావ్. వాటినీ పట్టించుకోలేదు. పిచ్చి పిచ్చగా మాట్లాడావ్. మళ్లీ సంస్కారం.. డెప్త్ ఉన్నట్టు సోది మాటలు మాట్లాడుతున్నావ్. నీ పనికి మాలిన మాటల గురించి మాకు తెలియదా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకు సంబంధం లేకపోయినా.. నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చేతకాదా? రాజకీయంగా విమర్శించావు.. ఓకే.. ఇప్పుడు మన తెలుగు సినిమా అని గర్వపడాల్సింది పోయి విమర్శిస్తావా? ఆర్ఆర్ఆర్ సినిమాకి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారా? నువ్వు చూశావా? రాజమౌళి, కీరవాణి సైలెంట్‌గా ఉండొచ్చు కానీ.. మేం చూస్తూ ఊరుకోవాలా? వేరే వాళ్లు విమర్శించారంటే అనుకోవచ్చు. అసలు నీకేం సంబంధం.. ఎందుకంత కుళ్లు. విషాన్ని కక్కడం ఎందుకు? మీరు విషం కక్కుతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటామా” అని నాగ‌బాబు అన్నాడు.

This post was last modified on March 12, 2023 7:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

13 hours ago