కాస్టింగ్ కౌచ్.. కొన్నేళ్ల నుంచి ఈ మాట తరచుగా వింటున్నాం. ఒకప్పుడు తమపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యే మహిళలు చాలా తక్కువగా కనిపించేవారు. ఇండస్ట్రీలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా నోరు విప్పేవాళ్లు కాదు. కానీ ‘మీ టూ’ ఉద్యమం తర్వాత ఎంతోమంది మౌనం వీడారు. సినీ పరిశ్రమలోనే కాక వివిధ రంగాల్లో తమపై జరిగిన అఘాయిత్యాలు.. ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళలు గళం విప్పారు. క్రమంగా ఈ మూమెంట్ కొంచెం మరుగున పడ్డప్పటికీ.. ఇప్పటికీ తరచుగా ఎవరో ఒక ఫిలిం సెలబ్రెటీ తమ జీవితంలో ఎదురైన ‘కాస్టింగ్ కౌచ్’ అనుభవాల గురించి చెబుతూనే ఉంటారు.
తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ వచ్చింది. బాలీవుడ్ చరిత్రలోనే మేటి నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విద్య.. కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడి నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
“నిజానికి నేను కాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు. కానీ నన్ను అందులోకి లాగే ప్రయత్నాలు జరగకుండా ఏమీ లేదు. కెరీర్ ఆరంభంలో ఒక చేదు అనుభవాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఒక యాడ్ షూట్ కోసం చెన్నైకి వెళ్లినపుడు ఓ దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాలని చూశాడు. ఆ దర్శకుడు ఓ సినిమా గురించి మాట్లాడేందుకు ముందు కాఫీ షాప్‌కు పిలిచాడు. కథ గురించి మాట్లాడుతుండగానే.. మిగతా విషయాలు రూంకి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. ఒక్కదాన్నే ఉండటం వల్ల కొంచెం భయపడుతూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక తన ఉద్దేశం అర్థమై నేను తెలివిగా గది తలుపులు తెరిచి ఉంచి పెట్టాను. అతడికి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు ఎవరూ ఏ సలహా ఇవ్వకపోయినా.. నాకు నేను తెలివిగా వ్యవహరించి నన్ను కాపాడుకున్నా” అని విద్య వెల్లడించింది.
This post was last modified on March 11, 2023 6:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…