నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ మీద విమర్శలు ఓ రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. రానా ముందే దీన్ని ఫ్యామిలీస్ తో చూడొద్దని హింట్ ఇచ్చినప్పటికీ క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ అభిమానులున్న వెంకటేష్ బ్రాండ్ వల్ల ఆ హెచ్చరికను పట్టించుకోకుండా షోలు వేసిన వాళ్లే ఎక్కువ. తీరా చూస్తే విచ్చలవిడి బూతుతో పాటు అసభ్యకర దృశ్యాలు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఇది వేరొకరు చేసుంటే ఇంత చర్చ ఉండేది కాదు. కానీ ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ స్టార్ డం ఉన్న సీనియర్ అగ్రనటుడు చేయడం వల్ల సమస్య వచ్చింది.
వీక్ గా ఉన్న ఇండియన్ మార్కెట్ ని బలోపేతం చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ మాములు స్కెచ్చులు వేయడం లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికే 2024లో రిలీజ్ కాబోతున్న దక్షిణాది క్రేజీ సినిమాలు చాలా కొనేసింది. మన జనానికి వెబ్ సిరీస్ లు అలవాటు చేయడం కోసం ఏకంగా వెంకటేష్ ని లైన్ లో పెట్టేసి తమ బ్రాండ్ మధ్యతరగతికి కూడా చేరేలా ప్లాన్ చేసుకుంది. రెమ్యునరేషన్ వల్ల వెంకీ ఒప్పుకున్నారా లేక దేశం మొత్తం ఈ ట్రెండ్ నడుస్తోందని చెప్పి ఒప్పించారా తెలియదు కానీ మొత్తానికి మొదటిసారి వెంకటేష్ అనవసరంగా టార్గెట్ అయ్యారు.
కొందరు ఫ్యాన్స్ ఇంతకన్నా దారుణమైన కంటెంట్ అన్ని ఓటిటిలో ఉన్నప్పుడు తమ హీరోనే ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారనే లాజిక్ తీస్తున్నారు. ఇదీ కరెక్ట్ కాదు. ఎవరో కర్ర హీరో చేస్తే జనం పట్టించుకోరు. చూడటం మానేస్తారు. కానీ ఒక బ్రాండ్ గా కోట్లాది ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి జవాబుదారీతనాన్ని ఆశించడం తప్పేమీ కాదు. గతంలో చిరంజీవి అల్లుడా మజాకా చేసినందుకు మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. అది సినిమా కాబట్టి నిరసన స్వరం గట్టిగా వినిపించింది. కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ కావడంతో అంత రచ్చ జరగకపోవచ్చు కానీ ఒకరకంగా చూస్తే నెట్ ఫ్లిక్స్ పక్కా ప్లాన్ తోనే ఇదంతా సెట్ చేసినట్టు కనిపిస్తోంది. లాభం తనకైనా నష్టం వెంకీకే.
This post was last modified on March 11, 2023 1:54 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…