Movie News

ముక్కు సర్జరీ తర్వాత బెంబేలెత్తిన హీరోయిన్


హీరోయిన్లు తమ అందాలను మెరుగు పరుచుకునే క్రమంలో సర్జరీలు చేయించుకోవడం మామూలే. కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఈ పని పూర్తి చేస్తుంటారు. సర్జరీల తర్వాత ఆ విషయం బయటికి కూడా చెప్పుకోరు. కానీ కొందరు మాత్రం ఈ విషయంలో ఓపెన్ అయిపోతుంటారు. శ్రీదేవి దగ్గర్నుంచి శ్రుతి హాసన్ వరకు ఇలా సర్జరీల బాట పట్టి ముక్కుతో పాటు రకరకాల పార్ట్‌లను సరి చేసుకున్న వాళ్లే. బ్రెస్ట్ సర్జరీలతో ఎద అందాలను పెంచుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇలా సర్జరీలు చేయించుకున్న వాళ్లపై కౌంటర్లు వేసిన హీరోయిన్లు కూడా ఉన్నారు.

కాగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ప్రియాంక చోప్రా కూడా కెరీర్ ఆరంభంలో తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయాన్ని తాజాగా తన ఆత్మకథలో వెల్లడించింది. ఆ సర్జరీ తర్వాత తాను ఎలా బెంబేలెత్తిపోయింది ఆమె వివరించింది.

“నేను నా ముక్కును సరి చేసుకునేందుకు ఒక సర్జరీ చేయించుకున్నా. కానీ ఆ సర్జరీ తర్వాత నా ఆకారం పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. ముక్కుకు ఉన్న బ్యాండేజీ తీసి చూుకున్నాక నేను, మా అమ్మ భయపడిపోయాం. నా ముఖం మరోలా కనిపించింది. అద్దంలో వేరే వ్యక్తిని చూస్తున్న భావన కలిగింది. జనాలు ఏమంటారో అని చాలా భయపడిపోయాను. నిరాశ చెందాను. నేను మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది” అని ప్రియాంక వెల్లడించింది.

ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ప్రియాంక.. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలు చేయడమే కాక హాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లోనూ నటించింది. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌ను పెళ్లాడి ఒక బిడ్డకు తల్లి కూడా అయిన ప్రియాంక.. త్వరలోనే ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on March 10, 2023 2:42 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

54 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago