ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ నిలిచిపోయినపుడు రాజమౌళి చాలా వర్రీ అయిపోయాడు. మళ్ళీ అందరి డేట్లు రాబట్టడం, సినిమాను సకాలంలో విడుదల చేయడం కష్టమని కంగారు పడ్డాడు. అందుకే లాక్ డౌన్ తీసేయగానే షూటింగ్ మొదలు పెట్టేయాలని మోక్ షూట్ కూడా చేసాడు.
కానీ కరోనా విజృంభణతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఇప్పుడైతే ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేయాలని, వీలయినంత త్వరగా విడుదల చేసేయాలనే ఆత్రుత ఈ చిత్ర బృందంలో అసలు లేదట. ఎందుకంటే థియేటర్లు మళ్ళీ తెరిచినా కానీ మార్కెట్ మునుపటిలా ఉండదని వసూళ్లు బాగా తగ్గుతాయని ట్రేడ్ పండితులు, నిర్మాతలు భావిస్తున్నారు.
అందుకని ఆర్.ఆర్.ఆర్. లాంటి సినిమాను విడుదల చేస్తే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఒక నాలుగైదు పెద్ద సినిమాలు విడుదలయి, మార్కెట్ పూర్వంలానే ఉన్నదనే నమ్మకం కలిగాకనే ఇది రిలీజ్ చేస్తే బెస్ట్ అంటున్నారు. అందుకే ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ వేగంగా పూర్తి చేసేయాలి, వచ్చే వేసవిలో విడుదల చేసేయాలి అని రాజమౌళితో సహా ఎవరూ భావించడం లేదట.