‘సైంధవ్’ కోసం ఇద్దరు హీరోయిన్స్ ? 

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా టైటిల్ తో గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమా ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో రుచి రుచూపించాడు శైలేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా ఈ  నెలాఖరు నుండి సెట్స్ పైకి రానుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదటి షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారు. అక్కడే కొంత భాగం ఘాట్ చేయబోతున్నారు. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ మరి కొంత పార్ట్ ఘాట్ చేసుకొస్తారు. 

సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ కంటే ముందే మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. తాజాగా రుహానీ శర్మను మరో హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. రుహానీ ఇందులో గెస్ట్ రోల్ కి కాస్త ఎక్కువగా ఉండే పాత్ర చేయనుందని తెలుస్తుంది. ఇద్దరిలో ఓ పాత్ర చనిపోతుందని ఇన్సైడ్ న్యూస్. 

త్వరలోనే మేకర్స్ ఈ  హీరోయిన్స్ కి వెల్కం ఆన్ బోర్డ్ చెప్పి పేర్లు ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరు మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారు. ‘హిట్’ ఫ్రాంచైజ్ తర్వాత శైలేష్ కొలను తీస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఎనౌన్స్ మెంట్ గ్లిమ్స్ తో రిలీజ్ చేసిన కంటెంట్ టీజర్ అందరినీ ఆకర్షించింది.