బోయపాటి శ్రీను మాస్ సినిమాలు తీయడంలో మేటి అనిపించుకున్న దర్శకుడు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోని ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినట్టు తన సమకాలీన దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదు.
అయితే మాస్ సినిమాలు తీయడంలో ఒక తిరకాసు ఉంది. ఏమాత్రం గీత దాటినా కానీ అతి అనిపించి అభాసుపాలవుతాయి. అందుకే బాలయ్య సినిమాలలో అన్ని ట్రోలింగ్ కి గురయ్యాయి. పవన్ కళ్యాణ్ మాస్ సినిమా కొమరం పులి కూడా అలానే కామెడీ అయిపోయింది.
బోయపాటి శ్రీను కూడా బ్యాలన్స్ తప్పి వినయ విధేయ రామ తీసాడు. అందులోని కొన్ని సన్నివేశాలను ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటి సినిమాలు మళ్ళీ చేయనని, ఫాన్స్ క్షమించాలని చరణ్ బహిరంగంగా లేఖ రాసాడు.
అయితే బోయపాటి మాత్రం ఆ సినిమాలో లోపం ఉందంటే ఒప్పుకునేవాడు కాదట. ఆ సినిమాకు టీవిలో వేసినప్పుడల్లా సూపర్ టీఆర్ఫీలు వస్తున్నాయి. ఇంత రిపీట్ వేల్యూ చాలా తక్కువ సినిమాలకు ఉందని అంటోంది స్టార్ మా నెట్వర్క్. తన సినిమా గొప్పతనం ఇప్పటికి తెలిసింది అనుకుని బాలకృష్ణ సినిమాలో వివివిలోని సిల్లీ సీన్లు మరిన్ని పెట్టేయడు కదా అని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on July 28, 2020 11:03 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…