శ్రీదేవికున్న చివరి కోరికల్లో ఇదొకటి

తెలుగు ప్రేక్షకులు దివంగత నటి శ్రీదేవిను అతిలోక సుందరిగా అభిమానించేవారు. హీరోయిన్స్ లో గొప్ప క్రేజ్ అందుకున్న నటిగా శ్రీదేవి ఎప్పటికీ గుర్తుంటారు. అయితే శ్రీదేవికి ఓ డ్రీమ్ ఉంది. తనయురాలు జాన్వి కపూర్ ను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయాలనేది శ్రీదేవికి కోరిక . తనను ఎంతో అభిమానించి గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు తన వారసత్వాన్ని అందించాలని ఆమె అనుకున్నారు. నిజానికి శ్రీదేవికున్న చివరి కోరికల్లో ఇదొకటి.

నిజానికి శ్రీదేవి బ్రతికి ఉండగానే తెలుగులో జాన్వి కపూర్ ను పరిచయం చేస్తానని, తనకి సరైన లాంచ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సన్నిహితులతో చెప్పుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు శ్రీదేవి కల నెరవేరింది. ఇప్పుడు జాన్వి కపూర్ ఎట్టకేలకు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి రెడీ అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ 30 లో ఆమెను హీరోయిన్ గా తీసుకొని వెల్కం చెప్పేశారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ -శ్రీదేవి కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు , శ్రీదేవి కూతురు కలిసి నటించి వారిద్దరినీ స్క్రీన్ పై గుర్తుచేయబోతున్నారు. మరి ఈ జంట ఎన్టీఆర్ -శ్రీదేవి లానే సూపర్ హిట్ జోడీ అనిపించుకుంటుందా ? చూడాలి.