బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షాహిద్ కపూర్ లాంటి పెద్ద పెద్ద హీరోలు వెబ్ సిరీస్‌లు చేశారు కానీ.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు పెద్దగా అటు వైపు చూడట్లేదు. తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ఇప్పటిదాకా డిజిటల్ ఎంట్రీ ఇవ్వలేదు. తొలిసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ఒకేసారి డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. వీళ్లిద్దరి కలయికలో స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ డిజిటల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచే ‘రానా నాయుడు’ స్ట్రీమ్ కాబోతోంది. సరిగ్గా ఈ సిరీస్ రిలీజయ్యే టైంకి టాలీవుడ్లో చెప్పుకోదగ్గ కొత్త థియేట్రికల్ రిలీజ్‌లు ఏమీ లేవు.
ముందు ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాను 10వ తేదీకి షెడ్యూల్ చేశారు కానీ.. అది వాయిదా పడిపోయింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘సీఎస్ఐ సనాతన్’ లాంటి చిన్న సినిమాలేవో కొన్ని రిలీజవుతున్నాయి. ఈ సినిమాలు వేటికీ బజ్ లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు కావివి. గత వారం విడుదలైన ‘బలగం’ ఓ మోస్తరుగా ఆడుతోంది తప్ప.. థియేటర్లు కొన్ని వారాల నుంచి డల్లుగా నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ‘రానా నాయుడు’ రిలీజవుతుండడంతో ఫోకస్ అంతా దాని మీదే నిలవబోతోంది.
‘రానా నాయుడు’ మీద ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనే కాక ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం వెంకీ షాకింగ్ లుక్‌లోకి మారారు. ఫ్యామిలీ హీరోగా పేరుపడ్డ ఆయన.. ఈ సిరీస్‌లో కొన్ని బూతులు పలకడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక క్రిమినల్ అయిన తండ్రి.. పోలీసాఫీసర్ అయిన కొడుకు మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. మరి వెంకీ-రానాల డిజిటల్ ఎంట్రీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on March 7, 2023 1:48 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…