గత ఇరవై నాలుగు గంటలకు పైగా సోషల్ మీడియాని ఊపేసిన కెజిఎఫ్ కామెంట్ల వ్యవహారం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. తాను వాడిన భాష పట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నానని అయితే అభిప్రాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నిన్న రాత్రి వెంకటేష్ మహా విడుదల చేసిన వీడియోకు మిశ్రమ స్పందన దక్కింది. చెప్పే సారీ ఏదో క్లియర్ గా చెప్తే పోయేదానికి మళ్ళీ మెలిక ఎందుకని నెటిజెన్లు కొందరు నిలదీశారు. ఈ ఇష్యూతో ఇతనితో పాటు పాల్గొన్న వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహనకృష్ణలు కూడా టార్గెట్ కావడం చాలా దూరం వెళ్ళింది.
మొత్తానికి పెద్ద బురద తొక్కినా కళ్ళు కడుక్కునే ప్రయత్నం అందరూ చేయడం విశేషం. కమర్షియల్ సినిమాని తామేమీ తీసిపారేయడం లేదని ఒకవేళ ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించమని ముందుగా నందిని రెడ్డి చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె డైరెక్ట్ చేసిన అన్నీ మంచి శుభశకునములే త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి అవసరం లేని వివాదాలు ఎంత మాత్రం మంచిది కాదు. వివేక్ ఆత్రేయ సైతం ఇన్స్ టా వేదికగా చిన్నపాటి సుదీర్ఘ వివరణ ఇచ్చి అక్కడి సందర్భంలో అనుకోకుండా నవ్వుతూ స్పందించాను తప్ప ఎవరినీ అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు.
మిగిలిన వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మొత్తానికీ వ్యవహారానికి శుభం కార్డు పడింది. వెంకటేష్ మహా తన మిత్రులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ మరో టెక్స్ట్ ట్వీట్ చేశారు. ఈ మొత్తం రభస మిగిలిన అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డేంజర్ బెల్ అనే చెప్పాలి. ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కదా మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఎలా బడితే అలా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను సైతం వెక్కిరించొచ్చని తొందరపడితే పరిణామాలు ఎలా ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. నోరు మంచిదైతే మనముండే ఊరు చుట్టూ ఉండే మనుషులు అందరూ మంచివాళ్లే అవుతారు.
This post was last modified on %s = human-readable time difference 1:43 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…