టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెకు బ్రేక్ పడింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొంటుండగా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గాయపడటంతో తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా వేసినట్టు సమాచారం. ఎముకలకు కలిగిన గాయంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో ప్రాధమికంగా చికిత్స తీసుకుని తిరిగి ముంబై వెళ్ళిపోయి తన స్వగృహం జల్సాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా అమితాబ్ స్వయంగా తన బ్లాగులో ఇచ్చిన వివరణ. కొన్ని వారాల పాటు డాక్టర్లు విశ్రాంతిని సూచించారట.
దీంతో ప్రాజెక్ట్ కె ఎంత కాలం ఆగుతుందో వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నిర్మాత అశ్వినీదత్ అసలు అమితాబ్ తమ సినిమా వల్ల ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని మూడు రోజుల క్రితమే ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిపోయారని చెప్పినట్టుగా వచ్చిన వార్త కొంత అయోమయానికి దారి తీస్తోంది. ఒకపక్కా ఆర్టిస్టు స్వయంగా విషయాన్ని వివరిస్తే ప్రొడ్యూసర్ నుంచి ఇంకో వెర్షన్ వినిపించడం అనూహ్యం. ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది జనవరి 12 విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.
అమితాబ్ రెస్ట్ కు కారణం ఏదైనా ఇప్పటికిప్పుడు ఆయన క్యారెక్టర్ ఉన్న సన్నివేశాలు మాత్రం చిత్రీకరించలేరు. బిగ్ బి భాగం ఎంత బాలన్స్ ఉందనే దాని మీద ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి వైజయంతి మూవీస్ నుంచి ఏదైనా నోట్ వస్తే ఈ కన్ఫ్యూజన్ కు తెరపడుతుంది. మనంలో చిన్న సీన్, సైరా నరసింహారెడ్డిలో ముఖ్యమైన పాత్ర చేశాక అమితాబ్ బచ్చన్ చేస్తున్న స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ ఇదే. ఆయనతో పాటు ఇందులో దీపికా పదుకునే, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలకు ఇలాంటి అవాంతరాలు అలవాటయ్యాయి.
This post was last modified on March 6, 2023 12:17 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…