ఉప్పెన లాంటి బ్లాక్‌బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయింది కృతి శెట్టి. నిజానికి ఈ సినిమా కోసం ముందు ఎంచుకున్న హీరోయిన్ వేరు. ప్రారంభోత్సవంలో కూడా ఆ అమ్మాయే పాల్గొంది. కానీ తర్వాత అనూహ్యంగా కృతి లైన్లోకి వచ్చింది. సినిమా రిలీజ్ ఆలస్యం అయినా సరే.. రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కృతికి అదిరిపోయే అప్లాజ్ వచ్చింది.
సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, తనకూ పేరు రావడంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ మాత్రమే బాగా ఆడింది. బంగార్రాజు అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఈ సినిమాలు ఆమె కెరీర్‌ను వెనక్కి లాగేశాయి.
తర్వాతి సినిమాలతో అయినా కెరీర్ పుంజుకుంటుందనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. తమిళంలో ఆమెకు వచ్చిన అవకాశాలు వచ్చినట్లే చేజారిపోతున్నాయి. ముందు బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి కృతిని కథానాయికగా ఎంచుకున్నారు. కానీ ఆ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత అరుణ్ విజయ్ హీరోగా ఓ సినిమాకు కృతిని తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఆ సినిమా నుంచి కృతిని తప్పించి రోషిణి ప్రకాష్ అనే కన్నడ కథానాయికను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఆమె ఆశలన్నీ నాగచైతన్య సరసన నటిస్తున్న కస్టడీ మీదే ఉన్నాయి. అది కూడా తేడా కొడితే కెరీర్ ముందుకు సాగడం కష్టమే. మలయాళంలోనూ టొవినో విజయ్ హీరోగా చేస్తున్న ఓ సినిమాకు కృతి కథానాయికగా ఎంపికైంది. కానీ ఆమె కెరీర్ అంతా టాలీవుడ్‌లోనే కావడంతో ఇక్కడ సక్సెస్ కావడమే కీలకం.
This post was last modified on March 5, 2023 11:32 pm
ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా ఒక ప్యాన్ ఇండియా సినిమాని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం ప్రమోషన్ల…
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లలో అత్యంత ఆదరణ, ఆదాయం ఉన్న ఐపీఎల్ టోర్నీ 18వ…
ప్రముఖ వ్యాపార వేత్త, ప్రపంచ కుబేరుడు గౌతం అదానీ.. ఏపీలో సౌర విద్యుత్కు సంబంధించి చేసుకున్న ఒప్పందాల వ్యవహారంలో అప్పటి…
కేంద్రంలోని బీజేపీ పెద్దలు మహా ఆనందంగా పార్లమెంటుకు వచ్చారు. సోమవారం నుంచి ప్రారంభమైన.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రతిష్టాత్మకంగానే కాదు..…
సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో అదానీ గ్రూప్ పై లంచం ఇచ్చారన్న ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.…
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…