టాలీవుడ్లో హిట్ చాలా అవసరమైన స్థితిలో ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. అతను నిఖార్సయిన హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. ఎప్పుడో 2014లో రిలీజైన లౌక్యం అతడి చివరి సూపర్ హిట్. ఆ తర్వాత అతడి సినిమాలేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. ఒక్క సీటీమార్ ఓ మోస్తరుగా ఆడింది తప్ప.. మిగతావన్నీ తుస్సుమనిపించాయి. గత ఏడాది మంచి అంచనాల మధ్య రిలీజైన పక్కా కమర్షియల్ పెద్ద డిజాస్టర్ కావడంతో గోపీ మార్కెట్ మీద గట్టి ప్రభావం పడింది.
కాకపోతే ఈసారి అతను తనకు లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్‌తో జట్టు కడుతుండడంతో రామబాణం మీద మంచి అంచనాలే ఉన్నాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.
ఈసారి వేసవికి పెద్ద స్టార్ల సినిమాలేవీ లేకపోవడం గోపీచంద్‌కు కలిసొచ్చింది. మే 5న క్రేజీ డేట్‌ను తన సినిమా కోసం బుక్ చేసుకున్నాడు. మిడ్ సమ్మర్ సీజన్ అంటే చాలా మంచి డేట్ అన్నట్లే. రామబాణం చిత్రానికి పెద్దగా పోటీ ఉండే అవకాశం కనిపించడం లేదు. ఈ వేసవిలో వారానికి ఒకటి చెప్పునే సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి ప్రస్తుతానికి. గత ఏడాది కార్తికేయ-2, ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్లు కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఆ సంస్థ ఉన్న ఊపులో సినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసేలా కనిపిస్తున్నారు.
గోపీ-శ్రీవాస్ శైలికి తగ్గట్లే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లున్నారు. పోస్టర్లు ఆ సంకేతాలే ఇస్తున్నాయి. గోపీ సరసన డింపుల్ హయతి నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు.
This post was last modified on March 5, 2023 9:42 am
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…