Movie News

ధమ్కీ సంగతి ఏంటి దాసూ

ఇప్పుడున్న హీరోల్లో మార్కెట్ పరంగా ప్రామిసింగ్ గా అనిపించే క్యాటగిరీలో విశ్వక్ సేన్ ఉన్నాడు. మరీ ఎక్కువ బడ్జెట్ పెడితే రికవర్ చేయడం కష్టం కానీ ఉన్నంతలో డీసెంట్ గా ఖర్చు జరిగితే ఈజీగానే లాభాలు వస్తాయి. ఇతని కొత్త సినిమా దాస్ కి ధమ్కీ విడుదలకు రెడీ అవుతోంది. ముందు ఫిబ్రవరిలో అనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. కట్ చేస్తే మార్చి వచ్చేసింది. 21 డిసైడ్ అయ్యారనే మాట వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ప్రమోషన్లు గట్రా ఇంకా మొదలుపెట్టలేదు. అదే రోజు చెప్పుకోదగ్గ పోటీ అయితే లేదు.

కార్తికేయ బెదురులంక మాత్రమే రేస్ లో ఉంది. ఇదేమీ భయపడే కాంపిటీషన్ కాదు. మరి ధమ్కీ ఎందుకు ఫిక్స్ కావడం లేదనేది అభిమానుల ప్రశ్న. దీనికి విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహించాడు. ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ కుప్పిలిని తీసుకుని ఆ తర్వాత హీరోనే బాధ్యతలు తీసుకున్నాడు. ఫలక్ నుమా దాస్ అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి అదేమీ ఇబ్బంది కాదు. బెజవాడ ప్రసన్న కుమార్ దీనికి రచన చేసిన సంగతి తెలిసిందే. అయితే ధమాకాకు దీనికి కొన్ని పోలికలు ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో ఆ ఛాయలు కనిపించాయి.

కానీ టీమ్ మాత్రం రెండు వేర్వేరు కథలని చెబుతోంది. సరే అది రిలీజయ్యాక తేలుతుంది కానీ ఒకవేళ మార్చి 21 లాక్ చేసుకుంటే మాత్రం హైప్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఓరి దేవుడాలో వెంకటేష్ లాంటి అగ్ర హీరో క్యామియో చేసినా ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మార్కెట్ పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విశ్వక్ సేన్ కు ఆ మధ్య యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన కామెంట్లు కొంత డ్యామేజ్ చేసినప్పటికీ అదంతా జనాలు మర్చిపోయారు. మాస్ కటౌట్ తో ధమ్కీని తీసిన ఈ కుర్రహీరో ఒకవేళ వారం గ్యాప్ లోనే వచ్చేస్తున్న నాని దసరా గురించి ఆలోచిస్తున్నాడేమో.

This post was last modified on March 4, 2023 1:49 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

34 seconds ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

7 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

18 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

57 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

1 hour ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago