ఏదో పొగడాలని కాదు కానీ మలయాళం ఫిలిం మేకర్స్ ఆలోచనా విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఊహాకతీతంగా అసలీ కథ సినిమాగా పనికొస్తుందాని అనుమానపడే వాటిని ఏకంగా సూపర్ హిట్ చేసి చూపిస్తారు. అలాని అన్నీ రీమేకులకు పనికొస్తాయని కాదు. ఆ మధ్య డిజాస్టర్ అయిన బుట్టబొమ్మ ఒరిజినల్ వెర్షన్ కప్పేలా కేరళలో ఘనవిజయం అందుకుంది. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఇక్కడ యావరేజ్ అయితే లూసిఫర్ పేరు మీద ఇండస్ట్రీ రికార్డులు ఉన్నాయి. సరే వీటి సంగతలా ఉంచితే ఇటీవలే ఇరట్టా అనే మూవీ వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోజు జార్జ్ హీరో.
దీని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. అది తెలుసుకోవాలంటే కథ మీద ఓ లుక్ వేయాలి. ఇందులో హీరో డబుల్ యాక్షన్. ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పని చేస్తుంటారు. తమ్ముడిది శాడిస్ట్ మనస్తత్వం. ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఓ రోజు ఉదయం మినిస్టర్ ప్రోగ్రాం జరగబోయే టైంలో కానిస్టేబుల్ గా ఉన్న తమ్ముడు పిస్తోలుతో కాల్చి చంపుకుంటాడు. ముందు హత్య అనుకుంటారు. తీరా అన్నయ్య రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టాక విస్తుపోయే నిజాలు బయటపడతాయి. ట్విస్ట్ తెలిశాక ఫ్యూజులు పోవడం ఖాయం. అతనెందుకు సూసైడ్ చేసుకున్నాడనేది జీర్ణించుకోలేం.
ఇది తెలుగులో రీమేక్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మానవ సంబంధాల పట్ల సున్నితంగా ఆలోచించే తెలుగు జనాలు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయలేరు. తండ్రి కూతురు అన్న చెల్లి వరసల మీద మనం పొరపాటున కూడా నెగటివ్ ట్విస్టులు చూడలేం. దానికి తగ్గట్టే మన దర్శక రచయితలు ఈ ఎమోషన్ల మీద అనవసరమైన ప్రయోగాలు చేయరు. కానీ ఇరట్ట దీనికి పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. సినిమా మరీ గొప్పగా లేదు. రెండు గంటల లోపే నిడివి ఉన్నా మధ్యలో చాలా బోర్ కొట్టిస్తుంది. చివరి ఘట్టం మాత్రం వామ్మో ఇదేం క్లైమాక్స్ బాబోయ్ అనిపించి వెంటాడుతుంది.
This post was last modified on March 4, 2023 12:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…