పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. తన సాటి హీరోలంతా రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేసుకుని వేగంగా దూసుకెళ్తున్న టైంలో సుకుమార్ నే నమ్ముకుని బన్నీ ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టడం పట్ల అభిమానులు ఆందోళన చెందిన మాట వాస్తవం . అయితే ప్యాన్ ఇండియా లెవల్ లో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకునేందుకు అల్లు అర్జున్ ఏ చిన్న రిస్క్ కి సిద్ధంగా లేడు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ ఫైనల్ గా అదిరిపోయే కాంబినేషన్ ని సెట్ చేసుకుని అఫీషియల్ గా ప్రకటించేశాడు.
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో, దాని రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో జెండా ఎగరేసి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో బన్నీ చేతులు కలిపాడు. ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ లాంటి బడా నిర్మాణ సంస్థ తోడవ్వడంతో బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ లకు వాళ్ళు పెట్టిన ఖర్చు మర్చిపోగలమా. సందీప్ ఇటీవలే రన్బీర్ కపూర్ తో యానిమల్ ని పూర్తి చేశాడు. అందులో రష్మిక మందన్న హీరోయిన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ లో రిలీజ్ అయ్యాక సందీప్ ఫ్రీ అవుతాడు.
నెక్స్ట్ ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మీద పని చేస్తాడు. దాని కోసం ఎంతలేదన్నా ఏడాది పైగానే అవసరముంటుంది. ప్రస్తుతం పుష్ప పూర్తయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే సమీకరణాలు ఎలాగైనా మారొచ్చు కాబట్టి తెలివిగా సీరియల్ నెంబర్లు ఇవ్వకుండా బన్నీ జాగ్రత్త పడ్డాడు. హీరోలను వైల్డ్ గా యారోగంట్ గా చూపించడంతో తన శైలిని చూపించిన సందీప్ వంగా ఒక్క దెబ్బతో విజయ్ దేవరకొండని స్టార్ చేసినప్పుడు ఏకంగా ఐకాన్ స్టారే దొరికితే సందీప్ అల్లు అర్జున్ ఇద్దరూ కలిసి అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా.
This post was last modified on March 3, 2023 12:09 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…