గత పదేళ్లలో దక్షిణాది సినిమాల్లో బాగా హైలైట్ అయి మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆర్టిస్టుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకడు. మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్‌ను మలయాళంలో కూడా ప్రేక్షకులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని పాత్రల్లో అద్భుతమైన నటనతో కట్టిపడేసిన అతను.. ఆ తర్వాత ఎన్నో విలక్షణమైన పాత్రలు తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటుడిగా నిలవడమే కాక అనేక అనేక పురస్కారాలు అందుకున్నాడు.
ఇతర భాషల నుంచి మేటి దర్శకులు కూడా అతడి వైపు చూసేలా చేసుకున్న ఫాహద్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్‌ను కూడా మెప్పించి పుష్పలో షెకావత్ పాత్రకు తనను ఎంచుకునేలా చేశాడు. ఈ పాత్ర సినిమాలో కనిపించింది కాసేపే అయినా ఎంత ఇంపాక్ట్ వేసిందో తెలిసిందే.
చివరి 20 నిమిషాల్లో సినిమా ఇంకో లెవెల్‌కు వెళ్లేలా చేసింది షెకావత్ పాత్రే. కాసేపు కనిపిస్తేనే అంత ఇంపాక్ట్ వేసిన ఫాహద్.. పుష్ప-2లో పూర్తిగా కనిపిస్తే ఇంకెంత మెస్మరైజ్ చేస్తాడో అని ప్రేక్షకులు మంచి అంచనాలతో ఉన్నారు. ఐతే పుష్ప-2 షూటింగ్ కొన్ని నెలల ముందే మొదలు కాగా.. ఇప్పటిదాకా అతను షూట్‌కు హాజరు కాలేదు. అల్లు అర్జున్ సహా దాదాపుగా ప్రధాన తారాగణమంతా ఒకరి తర్వాత సెట్స్‌లోకి వచ్చేయగా.. చివరగా ఇప్పుడు ఫాహద్ రంగప్రవేశం చేశాడు. ఫస్ట్ పార్ట్‌లో మాదిరే గుండు మేకప్ వేయించుకుని తాజాగా అతను షూటింగ్‌కు హాజరైనట్లు సమాచారం.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండే ఎర్రమంజిల్‌లో ఫాహద్ మీద సీన్లు తీస్తున్నాడట సుకుమార్. కొన్ని రోజుల తర్వాత బన్నీ, ఫాహద్ కాంబినేషన్ సీన్లు చిత్రీకరిస్తారట. ఈ చిత్రంలో కొత్తగా జగపతిబాబు రూపంలో మరో విలన్ రాబోతుండడం విశేషం.
This post was last modified on March 3, 2023 8:28 am
మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్…
అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక…
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…