Movie News

పొన్నియిన్ సెల్వన్ కు బుల్లితెర పరాభవం

తమిళనాడులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించి అని గొప్పగా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ కేవలం ఆ రాష్ట్రపు ఆడియన్స్ కి మాత్రమే నచ్చిందని చెప్పడానికి మరో సాక్ష్యం దొరికేసింది. మణిరత్నం ఎంత గొప్ప దర్శకులైనా చోళుల కథను అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో తడబడ్డారని టీవీ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చారు. ఇటీవలే తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరుపుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కు వచ్చిన టిఆర్పి రేటింగ్ అక్షరాలా 2.73 మాత్రమే. అది కూడా అర్బన్ మాత్రమే లెక్కలో తీసుకుంటే. రూరల్ కలిపి యావరేజ్ తీస్తే జస్ట్ 2.17.

మాములుగా డిజాస్టర్లకు మాత్రమే ఈ నెంబర్లు నమోదవుతాయి. పొన్నియిన్ సెల్వన్ మరీ అంత దారుణమైన చిత్రమేమీ కాదు. ఇక్కడ థియేట్రికల్ రెవెన్యూ సుమారు పది కోట్ల దాకా వచ్చింది. లాభాలు రాలేదు కానీ బ్రేక్ ఈవెన్ కి అతి కష్టం మీద అందుకుంది. జనాలు అధిక శాతం చూడలేదు కాబట్టి బుల్లితెరపై ఆదరిస్తారని లెక్కలు వేసిన శాటిలైట్ ఛానల్ కు పెద్ద షాక్ తగిలింది. అంటే మన పబ్లిక్ కి ఈ బ్యాక్ డ్రాప్ మీద ఏ మాత్రం ఆసక్తి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా నెలల క్రితమే అమెజాన్ ప్రైమ్ లో ఇచ్చేసి ఇప్పుడు తాపీగా టీవీలో వస్తే ఇంతకన్నా రెస్పాన్స్ కష్టమే.

ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఏప్రిల్ 28 విడుదల కానుంది. వాయిదా పడిందన్న పుకార్లు రెండు రోజులు షికారు చేశాయి కానీ ఇవాళ లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి డేట్ ని ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. సో అఖిల్ ఏజెంట్ కి సోలో రిలీజ్ దక్కి తమిళనాడు కేరళలో లాభం కలుగుతుందనుకుంటే అదేమి జరిగేలా లేదు. ఐశ్వర్య రాయ్, విక్రమ్ పాత్రలను హైలైట్ చేస్తూ పీఎస్ 2 లో చాలా కథను మణిరత్నం చెప్పబోతున్నారట. అయినా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ దాకా వెళ్తే పిఎస్ పక్క స్టేట్స్ నే గెలవలేకపోయింది.

This post was last modified on March 2, 2023 3:58 pm

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

25 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

32 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

49 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

54 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

3 hours ago