Movie News

లారెన్స్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా

ముప్పై ఏళ్ళ క్రితం ముఠామేస్త్రిలో చిరంజీవి పక్కన గుంపులో గుర్తుపట్టలేని డాన్సర్ గా మొదలై అదే మెగాస్టార్ కి హిట్లర్ లో అదిరిపోయే స్టెప్పులతో స్టార్ మాస్టర్ గా ఎదిగిన లారెన్స్ రాఘవేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది తనకు. నాగార్జునకు మాస్ లాంటి పెద్ద హిట్టు ఇవ్వడం అక్కినేని ఫ్యాన్స్ మర్చిపోలేరు. డాన్ యావరేజ్ అయినా అభిమానులకు నచ్చిన బొమ్మ అది. ప్రభాస్ తో రెబెల్ మాత్రం తన కెరీర్ లో ఓ బ్లాక్ స్పాట్ గా మిగిలింది. అయినా కూడా రీ రిలీజుల్లో దీన్ని కూడా బాగానే చూస్తున్నారు.

స్టార్ హీరోలు దూరం పెట్టాక లారెన్స్ రూటు మార్చాడు. డైరెక్టర్ గా హారర్ జానర్ కు షిఫ్ట్ అయ్యాడు. ఒకటే దెయ్యం కథను తిప్పి తిప్పి తీస్తాడనే కామెంట్ ఉన్నా అదేంటో బిసి సెంటర్స్ లో అవే కనక వర్షం కురిపించాయి. మునితో మొదలుపెట్టి కాంచన 3 దాకా ఇదే తంతు రిపీట్ అవుతూనే ఉంది. బయ్యర్లు సేఫ్ అవుతూనే వచ్చారు. గత కొంత కాలంగా కనిపించడం మానేసిన లారెన్స్ వచ్చే నెల 14న రుద్రుడుగా రాబోతున్నాడు. అయితే డైరెక్షన్ బాధ్యతలు తీసుకోలేదు లెండి. కథిరేషన్ దర్శకత్వంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా దెయ్యం బాపతే.

రుద్రుడు డబ్బింగ్ వెర్షన్ కు సంబంధించి ఏపీ తెలంగాణ హక్కులకు మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు పూర్వి పిక్చర్స్ తో పాటు ఠాగూర్ మధు 6 కోట్ల 50 లక్షలకు కొనేశారట. ఇది భారీ మొత్తమే. ఇంత లెక్క షేర్ గా రావాలంటే గ్రాస్ పది కోట్లు దాటాలి. అంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే సాధ్యమవుతుంది. ప్రింట్ మరియు పబ్లిసిటీ ఖర్చులు ఇందులోనే పొందుపరిచారు కాబట్టి ప్రమోషన్లు సరిగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా రికవరీ అవ్వొచ్చు. కాకపోతే మరీ రొట్ట రొటీన్ గా ఉండకూడదు. శాకుంతలం, బిచ్చగాడు 2తో ఈ రుద్రుడికి గట్టి పోటీ ఉంది.

This post was last modified on March 2, 2023 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

1 hour ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

2 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago