ప్రస్తుతం రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మొన్నీ మధ్యే ‘చెన్న కేశవ రెడ్డి’ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి మళ్ళీ పూనకాలు తెప్పించిన బాలకృష్ణ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తో వస్తున్నాడు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సింహా’ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. డేట్ ప్రకటించలేదు కానీ ప్రస్తుతం 4 కే వెర్షన్ రెడీ చేస్తున్నారు.
రీ రిలీజ్ట్రెండ్ లో మహేష్ ‘పోకిరి’ , పవన్ ‘జల్సా’ మంచి వసూళ్లు రాబట్టాయి. అనుకోని విధంగా దనుష్ డబ్బింగ్ సినిమా ‘3’ కూడా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. మిగతా సినిమాలు అంతగా పనవ్వలేదు. బాలయ్య ‘చెన్న కేశవ రెడ్డి’ కూడా రీ రిలీజ్ లో ఆశించిన స్థాయి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం ఫ్యాన్స్ తోనే కొన్ని షోస్ ఫుల్ అయ్యాయి తప్ప మిగతా ఆడియన్స్ ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో చూసేందుకు పెద్దగా ఇష్టపడలేదు.
అయితే ‘సింహా’తో బాలయ్య ఈసారి గట్టిగా గర్జించే అవకాశం ఉంది. బోయపాటి డిజైన్ చేసిన బాలయ్య పవర్ ఫుల్ పాత్రను వెండితెరపై ప్రేక్షకులు మళ్ళీ చూడాలనుకుంటారు. డాక్టర్ పాత్రలో బాలయ్య యాక్షన్ , డైలాగ్స్ కోసం ఈ సినిమాను ఆడియన్స్ కచ్చితంగా మళ్ళీ చూసే అవకాశం ఉంది. మరి ‘సింహా’ రీ రిలీజ్ తో బాలయ్య భారీ వసూళ్లు రాబడితే మిగతా మాస్ సినిమాలు కూడా క్యూ కడతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on March 2, 2023 6:09 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…