ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ తో స్టైలిష్ గా కనిపించే సుధీర్ బాబు ఉన్నపళంగా అదిక బరువుతో కనిపిస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇలాంటి షాకింగ్ లుక్ లోనే దర్శనమిచ్చాడు సుధీర్ బాబు. ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాలో సుదీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి పరశురామ్. ఈ పాత్ర కోసమే కొత్త మెకోవర్ ట్రై చేశాడు సుధీర్ బాబు.
దుర్గా , డీజె అనే మరో రెండు గెటప్స్ లో కనిపించనున్నాడు. ఈ గెటప్స్ ఎలా ఉండబోతున్నాయో త్వరలోనే చూపించనున్నారు మేకర్స్. సుదీర్ బాబు న్యూ మెకోవర్ చూస్తే ఒకప్పటి లడ్డు బాబు గుర్తుకొస్తాడు. అల్లరి నరేష్ -రవిబాబు కాంబినేషన్ లో వచ్చిన లడ్డు బాబు సినిమా కోసం ఇంతకంటే అదిక బరువు తో నరేష్ కనిపించాడు. ఆ మెకోవర్ కోసం రోజుకి రెండు గంటల పాటు కష్టపడ్డాడు.
అయితే నరేష్ లడ్డు బాబు కోసం పడిన కష్టమంతా వృదా అయింది. సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మరి ఇప్పుడు సుదీర్ బాబు కష్టం చూస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే సందేహం కలుగుతుంది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం సుదీర్ కి చాలా ముఖ్యం. గత కొన్నేళ్ళుగా ఈ కుర్ర హీరోకి సరైన హిట్ లేదు. మరి దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాతో సుదీర్ బాబు ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా ? చూడాలి.
This post was last modified on March 1, 2023 3:47 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…