వచ్చే నెల ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు. సహజంగానే పుష్ప 2 అప్డేట్ ని ఆశిస్తున్నారు అభిమానులు, అయితే ఉట్టి పోస్టర్ ని వదిలితే సంతృప్తి కలగదు కాబట్టి దర్శకుడు సుకుమార్ టీజర్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా తీసిన వాటిలో నుంచి తీసుకున్న సీన్లతో పాటు ప్రత్యేకంగా షూట్ చేయించిన ఫుటేజ్ ని ఇందులో జోడించబోతున్నారట. ఎలా అంటే వాల్తేరు వీరయ్య పరిచయం టీజర్ లో చూపించిన ఎపిసోడ్ సినిమాలో ఉండదు. అలాంటి ట్విస్టులు ఇక్కడా పెడతారన్న మాట.
ఈ వీడియో వెనుక లక్ష్యం ఇప్పటికే ఉన్న హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం. వ్యయం కాస్త ఎక్కువవుతున్నా సరే మైత్రి మేకర్స్ వెనక్కు తగ్గడం లేదు. అసలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు వచ్చిన విపరీత లాభాలు వాళ్ళను మాములు ఆనందంలో ఉంచడం లేదు. అమిగోస్ పోయినా దాన్నేమీ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడీ పుష్ప 2 విజువల్స్ బయటకి వదిలాక ముఖ్యంగా నార్త్ నుంచి క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా హిందీ వెర్షన్ తాలూకు డీల్స్ ఏవి ఫైనల్ చేయలేదు. బజ్ ని బట్టే రేట్ నిర్ణయించబోతున్నారు.
విడుదల విషయంలో సుక్కు టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బన్నీ మాత్రం 2023 సంక్రాంతిని టార్గెట్ చేయమంటున్న ప్రాజెక్ట్ కె ఆల్రెడీ అఫీషియల్ గా లాకైపోయింది కాబట్టి అలోచించి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రామ్ చరణ్ 15 కూడా పండగ బరిలో ఉంటే ఇబ్బందులు తప్పవు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ని మించి పదింతలు ఇందులో కంటెంట్ ఉంటుందని ముందు నుంచి సుకుమార్ బృందం ఊరిస్తూనే ఉంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ లాంటి మెయిన్ క్యాస్టింగ్ తోడయ్యాక షూటింగ్ వేగం పెరగనుంది.
This post was last modified on March 1, 2023 3:45 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……