హెల్త్ వర్కర్ల కోసమే హోటల్ తెరిచాడు. వేలాది మందికి తిండి పెట్టాడు. పీపీఈ కిట్లు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా వలస కార్మికుల కష్టాలు చూసి కదిలిపోయి.. ముంబయి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇలా ఏ వందా రెండొందల మందికి కాదు.. ఏకంగా 20 వేల మందికి సాయం చేశాడు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేశాడు. ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోనూ సూద్ సేవా నిరతి అక్కడికి ఆగిపోలేదు.
లాక్ డౌన్ వేళ అవస్థలు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిన వాళ్లందరికీ సాయపడుతున్నాడు. కష్టాల్లో ఉన్న వాళ్లు తమ సన్నిహితులకో.. ప్రభుత్వాలకో.. స్థానిక నాయకులకో కాకుండా.. సోనూకే తమ కష్టం చెప్పుకుంటున్నారు. చాలామంది సోషల్ మీడియా ద్వారా సమస్యల్ని సోనూ దృష్టికి తెస్తున్నారు. సోనూ ఇంకెంతమందికి సాయం చేస్తాం, ఇక చాల్లే అనుకోకుండా ఈ తోడ్పాటును కొనసాగిస్తూనే ఉన్నాడు.
దీంతో అందరికీ రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఇంతకీ సోనూ రేంజ్ ఏంటి.. అతడి దగ్గర ఎంత డబ్బుంది.. సోనూ సేవా భావంతోనే ఇదంతా చేస్తున్నాడా.. ఇంకేదైనా ఆశిస్తున్నాడా.. అతడికి వేరే వాళ్ల సపోర్ట్ ఏమైనా ఉంటోందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే సోనూ ఆర్థిక స్థితి విషయానికి వస్తే.. అతడి ఆస్తుల విలువ రూ.130 కోట్లు అని ఓ బాలీవుడ్ మీడియా సంస్థ వెల్లడించింది.
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ.. హిందీ, తెలుగు, తమిళం సహా బహు భాషల్లో నటించాడు. అన్ని చోట్లా మంచి పేరే సంపాదించాడు. ఇండియాలో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అతనొకడు. ఈ క్రమంలో సోనూ బాగానే సంపాదించాడు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ముంబయిలో పెద్ద ఇల్లు కొన్నాడు. హోటళ్లు తెరిచాడు.
ఐతే వేల కోట్లు ఉన్న వాళ్లకు కూడా చారిటీ కోసం డబ్బులు పెట్టడానికి మనసుండదు. తమ సంపాదనంలో 1 శాతం లోపు కూడా ఖర్చు చేయరు. కానీ సోనూ అలా ఆలోచించకుండా.. ఒక పరిమితి పెట్టుకోకుండా సాయం చేస్తూనే ఉన్నాడు. తన ఆస్తి విలువలో అతను కనీసం 10 శాతం అయినా ఖర్చు చేసి ఉంటాడని అంటున్నారు. అలా చూసినా అది గొప్ప విషయమే. అతడి వెనుక ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో లేదో తెలియదు మరి.
కానీ అతను కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడన్నది స్పష్టం. తన అండతో ఇళ్లకు చేరిన వలస కార్మికుల ఆనందం, ఉద్వేగం చూశాక జీవిత పరమార్థం ఏంటో సోనూ తెలుసుకున్నట్లున్నాడు. అందుకే ఆపకుండా తన సేవాభావాన్ని కొనసాగిస్తున్నట్లున్నాడు.
This post was last modified on %s = human-readable time difference 3:21 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…