భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొనదగ్గ సినిమా.. నాయకుడు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రం 1987లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ 35 ఏళ్లు గడిచాక ఇప్పుడు చూసినా ఆ సినిమా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పటి ప్రేక్షకులు కూడా ఆ చిత్రంతో కనెక్ట్ అవుతారు. అలాంటి క్లాసిక్ అందించిందిన హీరో, దర్శకుడు ఇన్నేళ్లలో మళ్లీ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే గత ఏడాది వీరి కలయికలో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పొన్నియన్ సెల్వన్-1తో భారీ విజయాన్ని అందుకున్న ఉత్సాహంలో కమల్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు మణి.
ఈ చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మీదే నిర్మిస్తుండడం విశేషం. అనౌన్స్‌మెంట్ తర్వాత వార్తల్లో లేని ఈ చిత్రం.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఒక వెరైటీ కథాంశంతో తెరకెక్కనుందట. చనిపోయిన ఒక మనిషి మళ్లీ బ్రతికి సమాజంలోకి వస్తే ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే పాయింటే ఇది.
మణిరత్నం నుంచి ఈ దశలో ఇలాంటి సినిమాను ఊహించలేం. ఇంకో రెండు నెలల్లోనే పొన్నియన్ సెల్వన్-2 విడుదల కాబోతోంది. కమల్ కొన్ని నెలల్లో ఇండియన్-2 పూర్తి చేయబోతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని అంచనా. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించనుంది. ఇంతకముందు కమల్‌తో ఆమె మన్మథబాణం, చీకటి రాజ్యం సినిమాలు చేసింది.
This post was last modified on March 1, 2023 11:17 am
వైసీపీ భవిష్యత్తు కోసం సలహాలు, సూచనలు ఇచ్చే వారిని ఆ పార్టీ నేతలు ఓ రకమైన దృష్టితో చూస్తుండటం అందరికీ…
ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసి దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా వెలుగొందాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఆ…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను మించే హీరో రాడు అని అందరూ అనుకున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో ఫ్యాన్…
టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు…
ఏడాదిన్నర పాటు అభిమానులను వెయిటింగ్ లో ఉంచిన అఖిల్ కొత్త సినిమా కొన్ని వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.…
ఇవ్వటంలో ఉండే ఆనందం అందరికి అర్థం కాదు. నలుగురికి సాయం చేసే ఛాన్సు దొరికితే కొందరు మాత్రమే ఆ దిశగా…