80వ దశకంలో కథానాయికగా కొన్నేళ్లు మంచి మంచి పాత్రలతో అలరించిన జీవిత.. హీరో రాజశేఖర్‌ను పెళ్లాడాక నటనకు దూరం అయిపోయారు. ఆ తర్వాత ఆమె భర్త కెరీర్ మీదే దృష్టిసారించారు. ఆయన హీరోగా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూస్ కూడా చేశారు. జీవిత నటిగా కనిపించి దశాబ్దాలు దాటిపోయింది. ఐతే ఆమె చాలా కాలం తర్వాత ముఖానికి రంగు వేసుకుంటున్నట్లు సమాచారం. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా కోసం అని వార్తలు వస్తుండడం విశేషం.
ప్రస్తుతం హీరోగా జైలర్ సినిమాలో నటిస్తున్న రజినీకాంత్.. తన చిన్న కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రాబోయే ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును కొన్ని నెలల కిందటే ప్రకటించారు.
లాల్ సలామ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది. రజినీ ఇందులో తక్కువ రన్ టైంలో ముగిసిపోయే ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు ఆయనకు సోదరిగా ఒక స్పెషల్ రోల్‌లో జీవిత కనిపించనుందట.
దశాబ్దాల నుంచి నటనకు దూరంగా ఉన్న జీవితనే ఈ పాత్రకు తీసుకోవాలని ఐశ్వర్యకు ఎందుకు అనిపించిందో ఏమో? రజినీ కూతురు తీస్తున్న సినిమా.. పైగా రజినీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో జీవిత ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. చెన్నైలో కొన్ని రోజుల పాటు ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతోందట. చివరగా ఆమె దర్శకురాలిగారాజశేఖర్ హీరోగా మలయాళ సినిమా జోసెఫ్‌ను శేఖర్ పేరుతో రీమేక్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో జీవిత, రాజశేఖర్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.
This post was last modified on March 1, 2023 9:19 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…