ప్రాంతీయ భాషా చిత్రాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులు ఒకేసారి రెండు గెలిచే స్థాయికి ఎదిగాడు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్. ఇది భారతీయులు గర్వించదగ్గ విషయం.
ఐతే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో సంచలనం సృష్టించాక రెహమాన్ కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనుకుంటే అలా ఏమీ జరగలేదు. ఒకప్పటితో పోలిస్తే అతడికి అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్లో రెహమాన్ వెనుకబడిపోయాడు. ఇందుకు కారణాలేంటో ఎవరికీ అంతుబట్టలేదు.
ఐతే తాజాగా ‘దిల్ బేచారా’ మూవీతో మళ్లీ తనేంటో చాటి చెప్నాడు రెహమాన్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ పని చేస్తోందంటూ సంచనల వ్యాఖ్యలు చేశాడు. ‘దిల్ బేచారా’ సినిమా కూడా తన చేతికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగినట్లు వెల్లడించాడు.
సౌమ్యుడు, వివాద రహితుడు అయిన రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపిింది. రెహమాన్ వ్యాఖ్యలపై లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్‌కు ఆస్కార్ అవార్డులు రావడమే శాపమైందన్నాడు. ఇతను మన స్థాయి దాటిపోయాడు.. మనం హ్యాండిల్ చేయలేం అనే భావన బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌లో వచ్చేసిందని.. అందుకే ఆయనతో వాళ్లు సినిమాలు చేయట్లేదని అన్నాడు. దీనికి రెహమాన్ బదులిస్తూ డబ్బులు పోతే వెనక్కి తెచ్చుకోవచ్చని.. కానీ మనం ప్రైం టైంను కోల్పోతే వెనక్కి తెచ్చుకోలేమని.. ఇలాంటివి పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్పిందే అన్నాడు.
ఇదిలా ఉంటే రెహమాన్‌తో పాటే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు ఆస్కార్ అందుకున్న సౌండ్ డిజైనర్ రసూల్ పొకుట్టి లైన్లోకి వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఆస్కార్ గెలిచాక తనకు అవకాశాలు ఆగిపోయాయని.. తనతో పని చేయలేమని చాలామంది ముఖం మీదే చెప్పేశారని.. తాను పని లేక ఖాళీ అయిపోయాయని షాకింగ్ విషయం వెల్లడించాడు. మొత్తానికి ఆస్కార్ అవార్డులు గెలిస్తే కెరీర్ ఇంకా గొప్ప స్థాయికి చేరడం పోయి.. ఇలా దెబ్బతినడం ఆశ్చర్యం కలిగించే విషయం.
This post was last modified on July 27, 2020 3:13 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…